కర్ణాటక, బెంగళూరు జిల్లాలోని ఆర్కే పురం పోలీసు స్టేషన్ పరిధిలో అక్రమ రవాణా చేస్తున్న 500 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి తరలిస్తూ అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.
మారువేషంలో..
రాజస్థాన్ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మాదకద్రవ్యాలను తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు.. మారువేషంలో గంజాయి వినియోగదారులుగా నిందితులను కలిశారు. అనంతరం, లారీని సీజ్ చేసి తనిఖీ చేయగా.. ఎలాంటి మాదకద్రవ్యాలు దొరకలేదు. నిందితులను ప్రశ్నించగా.. లారీ డ్రైవర్ క్యాబిన్ వెనుకభాగంలో 500 కిలోల గంజాయి బయటపడింది. దీని విలువ దాదాపు కోటి రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: మత్తుమందు ఇచ్చి బాలికపై తాంత్రికుడు అత్యాచారం