ETV Bharat / bharat

బంగాల్​ బరి: ఏడో దశ పోలింగ్​కు సర్వం సిద్ధం

బంగాల్ శాసనసభ ఎన్నికల ఏడో విడత పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. సోమవారం 34 నియోజకవర్గాలకు ఓటింగ్ జరగనుంది. 284 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

7th phase polling
బంగాల్​ ఏడో దశ పోలింగ్​
author img

By

Published : Apr 25, 2021, 5:31 PM IST

బంగాల్ శాసనసభ ఎన్నికల ఏడో విడత పోలింగ్​కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి సిట్టింగ్​ స్థానమైన భవానీపుర్​ సహా 34 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

ముర్షీదాబాద్​ జిల్లాలో 9 నియోజకవర్గాలకు, పశ్చిమ బర్ధమాన్​ జిల్లాలో 9, దక్షిణ దినాజ్​పుర్​లో 6, మాల్డాలో 6, కోల్​కతాలోని 4 నియోజకవర్గాలకు 12,068 కేంద్రాల్లో పోలింగ్​ జరగనుంది. మొత్తం 284 మంది అభ్యర్థుల్లో 37 మంది మహిళలు ఉన్నారు.

బంగాల్​ దంగల్​ ఏడో దశ

  • శాసన సభ స్థానాలు: 34
  • మొత్తం అభ్యర్థులు: 284
  • ఓటర్లు: 86.7 లక్షలు
  • పోలింగ్​ కేంద్రాలు: 12,068

ప్రముఖుల పోరు..

ఈ ఎనిమిదో విడత పోలింగ్​లో అందరి దృష్టి భవానీపుర్​ నియోజకవర్గంపైనే ఉంది. తృణమూల్​ కాంగ్రెస్​ అధినేత్రి మమతా బెనర్జీ సిట్టింగ్​ స్థానమైన ఈ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున ఈసారి శోభన్​ దేవ్​ ఛటర్జీ బరిలో ఉన్నారు. భాజపా అభ్యర్థి రుద్రనీల్​ ఘోష్​తో ఆయన పోటీ పడుతున్నారు.

కోల్​కతా పోర్ట్​ నియోజకవర్గం నుంచి టీఎంసీ తరఫున రాష్ట్ర మంత్రి ఫిర్హాద్​ హకీమ్​.. భాజపా అభ్యర్థి రిటైర్డ్​ లెఫ్టినెంట్​ జనరల్​ సుబ్రతా సాహాతో తలపడుతున్నారు.

ముందే ముగిసిన ప్రచార పర్వం..

రాష్ట్రంలో కరోనా కేసులు విస్తరిస్తున్న వేళ ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఓటింగ్​కు మూడు రోజుల ముందే ప్రచారం ముగించాలని ఆయా పార్టీలకు సూచించింది. అంతకుముందున్న నిబంధనల ప్రకారం.. పోలింగ్​కు 48 గంటల ముందువరకు ప్రచారం నిర్వహించేందుకు వీలుండేది.

పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు..

గత విడతల పోలింగ్​లో తలెత్తిన ఉద్రిక్తతల దృష్ట్యా.. ఈసారి భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 796 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించినట్లు చెప్పింది. ఓటర్లు కొవిడ్-19 నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది.

ఇదీ చూడండి: భవానీపుర్​లో దీదీ మ్యాజిక్ పనిచేసేనా?

ఇదీ చూడండి: కరోనాతో టీఎంసీ ఎమ్మెల్యే అభ్యర్థి మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.