BDL Jobs In Telangana 2023 : బీటెక్ లేదా డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) శుభవార్త వినిపించింది. తెలంగాణ సంగారెడ్డి జిల్లా భానూర్‌లోని తమ సంస్థలో డిప్లొమా అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం అర్హత గలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాలు..
BDL Apprentice Recruitment 2023 :
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ : 83 పోస్టులు
- టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటీస్ : 36 పోస్టులు
విద్యాఅర్హతలు..
అభ్యర్థులు సంబంధిత ఇంజినీరింగ్ విభాగంలో డిప్లొమా/ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నవంబర్ 2020/ 2021/ 2022/ 2023 సంవత్సరాల్లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసినవారు మాత్రమే అర్హులు.
విభాగాలు..
- సివిల్
- ఈఐఈ
- కెమికల్
- ఈసీఈ
- ఈఈఈ
- మెకానికల్
- సీఎస్‌ఈ/ ఐటీ
స్టైపెండ్..
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌లకు ప్రతినెలా రూ.9,000
- టెక్నీషియన్ అప్రెంటీస్‌లకు నెలకు రూ.8,000
శిక్షణ కాలం..
ఎంపికైన అభ్యర్థులకు ఏడాది పాటు శిక్షణను ఇస్తారు.
ఎంపిక విధానం..
అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ముఖ్యమైన తేదీలు..
BDL Apply Last Date :
- దరఖాస్తు ప్రారంభ తేదీ : 2023 అక్టోబర్ 17
- దరఖాస్తుకు చివరి తేదీ : 2023 అక్టోబర్ 20
అధికారిక వెబ్సైట్..
పైన తెలిపిన అప్రెంటీస్‌షిప్‌కు సంబంధించి మరిన్ని వివరాల కోసం బీడీఎల్ అఫీషియల్ వెబ్సైట్ https://bdl-india.in/home-pageను చూడవచ్చు.
GRSE Apprentice Jobs 2023 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా అర్హతతో.. GRSEలో అప్రెంటీస్ పోస్టులు.. దరఖాస్తు చేసుకోండిలా!
GRSE Apprentice Jobs 2023 : గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజినీర్స్ లిమిటెడ్ 246 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రేడ్ అప్రెంటీస్, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
Trade Apprentice Jobs 2023 :
- ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ) - 134
- ట్రేడ్ అప్రెంటీస్ (ఐటీఐ - ఫ్రెషర్స్) - 40
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ - 25
- టెక్నీషియన్ అప్రెంటీస్ - 47
- మొత్తం పోస్టులు - 246
విద్యార్హతలు
GRSE Apprentice Eligibilities : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థ నుంచి డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఐటీఐ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఆల్ ఇండియా ట్రేడ్ టెస్ట్ (AITT) క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
GRSE Apprentice Age Limit :
- ట్రేడ్ అప్రెంటీస్ (ఎక్సీపీరియన్స్డ్ ఐటీఐ) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 25 ఏళ్లు మధ్యలో ఉండాలి.
- ట్రేడ్ అప్రెంటీస్ (ఫ్రెషర్స్) అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 20 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- టెక్నీషియన్ అప్రెంటీస్ అభ్యర్థుల వయస్సు 14 ఏళ్లు నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి.
ఎంపిక ప్రక్రియ
GRSE Apprentice Selection Process : అభ్యర్థులను.. వారి అకడమిక్ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేస్తారు. అయితే ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించాలా లేదా అనేది GRSE అథారిటీ నిర్ణయిస్తుంది. మార్కుల మెరిట్/ రాత పరీక్ష తరువాత.. అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి.. డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.
ఆన్లైన్లో అప్లై చేయండి ఇలా!
GRSE Apprentice Online Apply Process :
- ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://www.apprenticeshipindia.gov.in/ వెబ్సైట్లో అప్రెంటీస్‌షిప్ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. తరువాత..
- గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ https://grse.in ఓపెన్ చేయాలి.
- కేరీర్స్ ఆప్షన్స్‌లో.. ట్రేడ్ అప్రెంటీస్/ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ టెక్నీషియన్ అప్రెంటీస్ దరఖాస్తును ఎంచుకోవాలి. తరువాత
- ఆన్లైన్ అప్లై ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్ ఐడీ, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి.
- లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా అప్లికేషన్ ప్రాసెస్‌ను పూర్తి చేయాలి. అంటే విద్యార్హతలు, వక్తిగత వివరాలను అప్లికేషన్ ఫారమ్‌లో నమోదు చేయాలి. తరువాత ముఖ్యమైన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేయాలి.
- మరోసారి వివరాలు అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేదో చెక్ చేసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.
- భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్అవుట్ను భద్రపరుచుకోవాలి.
ముఖ్యమైన తేదీలు
GRSE Apprentice Important Dates :
- దరఖాస్తుల స్వీకరణ ఇప్పటికే ప్రారంభమైంది.
- దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ : 2023 అక్టోబర్ 29
AIIMS Jobs 2023 : ఎయిమ్స్‌లో గ్రూప్ - ఏ, గ్రూప్ - బి పోస్టులు.. అప్లై చేసుకోండిలా!
UCIL Apprentice Jobs 2023 : ఐటీఐ అర్హతతో.. UCILలో 243 అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేసుకోండిలా!