ETV Bharat / bharat

'డచ్​' ఎత్తుల్ని చిత్తుచేసిన కేరళ కింగ్ మార్తాండవర్మ - కేరళ కింగ్ మార్తాండవర్మ

Azadi Ka Amrit Mahotsav: చరిత్ర పుటల్లో ఎక్కడ చూసినా భారతీయులు ఓడిపోయిన యుద్ధాలే ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా యూరోపియన్లపై! కానీ ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన భారీ యూరోపియన్‌ బలగాన్ని ఓడించిన ఘనత మన భారతీయ రాజు మార్తాండవర్మది! ఈ కేరళ వీరుడే లేకుంటే భారత్‌లో మనమంతా ఈ రోజు ఇంగ్లిష్‌ బదులు డచ్‌ మాట్లాడుతూ ఉండేవారమంటారు కొందరు చరిత్రకారులు.

Azadi Ka Amrit Mahotsav
డచ్​వారిని దంచికొట్టిన కేరళ కింగ్ మార్తాండవర్మ
author img

By

Published : Mar 15, 2022, 7:26 AM IST

Azadi Ka Amrit Mahotsav: ఆంగ్లేయులకంటే ముందే వ్యాపారం పేరుతో మనపై పెత్తనం చెలాయించటానికి వచ్చింది డచ్‌ ఈస్టిండియా కంపెనీ. ఇది అప్పటికే ప్రపంచంలోనే అత్యంత పటిష్ఠమైన కంపెనీగా పేరుగాంచింది. ఈ కంపెనీ సైన్యం దక్షిణాఫ్రికా, ఇండోనేసియా, శ్రీలంకలను జయించి భారత్‌పై కన్నేసింది. 1700 నాటికి కేరళ వ్యాపారమంతా దాదాపు డచ్‌ చేతుల్లోకి వెళ్లింది. హిందూ మహాసముద్ర మార్గంలో ఎవరు వ్యాపారం చేయాలన్నా డచ్‌ కంపెనీకి పన్నులు చెల్లించాల్సి వచ్చేది.

కేరళలోని అనేక రాజ్యాలు సుగంధ ద్రవ్యాలను పండించి ఓడల ద్వారా అరబ్‌ దేశాలకు, ఐరోపాకు ఎగుమతి చేసేవి. ముఖ్యంగా ఇక్కడ పండే మిరియాలకు విదేశాల్లో విపరీతమైన డిమాండ్‌ ఉండేది. దీన్ని నల్లబంగారంగా పిలిచేవారు. శీతలీకరణ రాకముందు.. ఆహార పదార్థాలను నిలువ ఉంచటంలో ఈ మిరియాలను వాడేవారు. కేరళ మిరియాల వ్యాపారంపై డచ్‌ వారు ఏకఛత్రాధిపత్యం కోసం ఎత్తుగడ వేశారు. రాజులకు సైనిక, ఆర్థిక సాయం చేస్తూ ఒప్పందాల పేరుతో వారిని తమ చెప్పుచేతల్లో ఉంచుకున్నారు. అంతర్గత ఇబ్బందులకు తోడు.. బలమైన ఆయుధ సంపత్తిగల యురోపియన్‌ కంపెనీ ముందు ఈ రాజులు అచేతనులై పోయారు. కానీ ట్రావెన్‌కోర్‌ మహారాజు మార్తాండవర్మ డచ్‌ ఎత్తుగడలకు కళ్లెం వేశారు.

1705లో తిరువిత్తమ్‌కూర్‌ (తర్వాత ట్రావెన్‌కోర్‌గా మారింది) రాజ కుటుంబంలో జన్మించారు మార్తాండవర్మ. ఆయన పుట్టేనాటికి అది చిన్న రాజ్యం. 24వ ఏటనే పగ్గాలు చేపట్టిన వర్మ 50వేల మందితో భారీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకొని క్రమంగా చుట్టుపక్కలున్న చిన్నచిన్న రాజ్యాలను జయిస్తూ తన సామ్రాజ్యాన్ని విస్తరించటం మొదలెట్టారు. ఆ క్రమంలో కాయంకులమ్‌ రాజధాని ఒడనాడ్‌ (ప్రస్తుత అళపుజ జిల్లా)పై దృష్టి పడింది. అది మిరియాల ఉత్పత్తికి పేరొందింది. అప్పటికే డచ్‌ ఈస్టిండియా కంపెనీ ఒడనాడ్‌ మిరియాల వ్యాపారాన్ని గుప్పిట పెట్టుకుంది. అందుకే శ్రీలంకలో డచ్‌ గవర్నర్‌ వెంటనే మార్తాండవర్మకు హెచ్చరిక పంపించాడు. కాయంకులమ్‌ వైపు కన్నెత్తి చూస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని బెదిరించాడు. యుద్ధం అనివార్యమైంది. అందుబాటులో ఉన్న బలగాలతో ప్రయత్నించగా డచ్‌ సైన్యం ఓడిపోయింది. దీన్ని అవమానంగా భావించిన డచ్‌ గవర్నర్‌ శ్రీలంక నుంచి భారీగా తమ సైన్యాన్ని దించి పూర్తిస్థాయిలో యుద్ధభేరి మోగించాడు.

కెప్టెన్‌ డెలనోయ్‌ సారథ్యంలోని డచ్‌ సైన్యం ఏకంగా ట్రావెన్‌కోర్‌ రాజధాని పద్మనాభపురాన్ని చుట్టుముట్టింది. పద్మనాభపురానికి 13 కిలోమీటర్ల దూరంలోని కొలాచల్‌ వద్ద స్థావరం ఏర్పాటు చేసుకుంది. 1741 మే 27న యుద్ధం ఆరంభమైంది. ఈ పోరాటంలో స్థానిక మత్స్యకారులు కీలకపాత్ర పోషించారు. వారు అనూహ్యంగా డచ్‌ సేనల్ని వెనకనుంచి దెబ్బతీశారు. ముందు నుంచి భూమార్గంలో మార్తాండవర్మ సేనలు వ్యూహాలు పన్నుతూ డచ్‌వారిని కొలాచల్‌ కోటలో దిగ్బంధనం చేశాయి. ఆగస్టు 10న డచ్‌ కెప్టెన్‌ డెలనోయ్‌తో పాటు అనేక మందిని మార్తాండవర్మ సేన అదుపులోకి తీసుకుంది. మిగిలిన వారు ఓడల్లో పారిపోయారు. ఆ తర్వాత.. డెలనోయ్‌నే తన సైన్యాధికారిగా చేసుకొని.. యూరోపియన్‌ తరహాలో తన సైన్యానికి శిక్షణ ఇప్పిస్తూ మరింత పటిష్ఠం చేశారు మార్తాండవర్మ! ఆ పరాజయం అనంతరం మళ్లీ ఎన్నడూ డచ్‌ కంపెనీ కేరళలోనే కాదు భారత్‌లోనే అంతగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది. మధ్యలో ఒకట్రెండుసార్లు కొంతమంది చిన్నచిన్న రాజులను రెచ్చగొట్టినా మార్తాండవర్మ వాటన్నింటినీ చిత్తు చేశారు. దీంతో.. 1753లో ఆయనతో ఒప్పందం చేసుకున్నారు డచ్‌వారు. ట్రావెన్‌కోర్‌ అత్యంత సుసంపన్న బలమైన రాజ్యంగా ఆవిర్భవించింది. చిన్న రాజ్యాన్ని విస్తరించి.. కేరళలోనే కాకుండా దక్షిణాదిన ట్రావెన్‌కోర్‌ను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దిన మార్తాండవర్మ అనేక పాలన, భూ సంస్కరణలు కూడా చేపట్టారు. 1750లో అనంత పద్మనాభ స్వామికి తన రాజ్యాన్ని సమర్పించుకున్నారు. పద్మనాభదాసుడిగా అధికారాన్ని కొనసాగించారు.

ప్రస్తుత అనంత పద్మనాభస్వామి దేవాలయానికి, అందులోని ప్రధాన మూర్తికి మెరుగులు దిద్దించారు. ఆలయ నిధుల్లో చాలామటుకు.. డచ్‌ బంగారు నాణేలు కూడా ఉన్నాయంటారు! మార్తాండ వర్మ ఉన్నంతకాలం (1758 వరకూ).. ఏ యూరోపియన్‌ కంపెనీ, సైన్యం తలెత్తటానికి ధైర్యం చేయలేదు.

ఇదీ చూడండి: 'అండమాన్‌'పై పట్టుకోసం ఆ దేశాల ఆరాటం.. చివరి నిమిషంలో..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.