ETV Bharat / bharat

కశ్మీర్​లో మరో సర్పంచ్​పై ఉగ్రదాడి.. ఐజీ కీలక వ్యాఖ్యలు - sarpanch attacks kashmir

attack on sarpanch kashmir: జమ్ము కశ్మీర్​లో సర్పంచ్​లకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు అక్కడి ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో సురక్షితమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం మరో సర్పంచ్​పై దాడి జరిగింది.

Kashmir Terrorist attacks
Kashmir Terrorist attacks
author img

By

Published : Mar 12, 2022, 5:54 PM IST

attack on Sarpanch Kashmir: కశ్మీర్​లో మరో సర్పంచ్​పై దాడి జరిగింది. హల్కా అరిహాల్-బీ పంచాయతీకి చెందిన గులాం నబీ కుమార్​పై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అయితే, ముష్కరుల గురి తప్పడం వల్ల సర్పంచ్ నబీ ప్రాణాలతో బయటపడ్డారు. బాధితుడు స్వతంత్ర అభ్యర్థి అని అధికారులు తెలిపారు.

Kashmir Terrorist attacks

సర్పంచ్​లపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ స్పందించారు. ఉగ్రవాదుల ముప్పు ఎదుర్కొంటున్న సర్పంచ్​లు, పంచ్​లకు భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీనగర్ సహా అన్ని జిల్లా ప్రధాన కేంద్రాలలో సురక్షిత వసతి సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. 'కుల్గాంలో శుక్రవారం మరణించిన సర్పంచ్​కు కూడా మేం అవసరమైన భద్రత కల్పించాం. అయితే, ఆయన సమాచారం ఇవ్వకుండా దక్షిణ కశ్మీర్​కు వెళ్లారు' అని ఐజీ వివరించారు. జమ్ముకశ్మీర్‌లో మూడు వేర్వేరు జిల్లాల్లో జరిగిన ఎన్​కౌంటర్​లపైనా వివరాలు తెలియజేశారు విజయ్ కుమార్. పాకిస్థాన్​కు చెందిన ముష్కర కమాండర్ ఖాలిద్ భాయ్, అతడి అనుచరుడు యాకిబ్ ముస్తాక్ మరణించినట్లు వెల్లడించారు.

గడిచిన మూడు రోజుల్లో ముగ్గురు సర్పంచ్​లపై దాడి జరిగింది. అందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: ల్యాండింగ్​లో అపశృతి.. రన్​వే పైనుంచి పక్కకు జరిగిన విమానం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.