ETV Bharat / bharat

DIG ఫోన్​నే చోరీ చేసిన దొంగ.. పడవలో వచ్చి పక్క ఊరి ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లిన గ్రామస్థులు.. - ఉత్తరప్రదేశ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ

Assam DIG Cell Phone Snatched : బైక్​పై వచ్చిన దొంగ.. అసోం రాష్ట పోలీస్​ డీఐజీ మొబైల్​నే ఎత్తుకెళ్లాడు. డీఐజీ మార్నింగ్​ వాకింగ్​ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఓ గ్రామానికి చెందిన ట్రాన్స్​ఫార్మర్​ను మరో గ్రామానికి చెందిన వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఉత్తర్​ప్రదేశలో ఈ ఘటన జరిగింది.

assam-dig-vivek-raj-singh-cell-phone-snatched-by-thieves
అసోం డీఐజీ సెల్‌ఫోన్‌ చోరీ
author img

By

Published : Jul 23, 2023, 10:39 PM IST

Assam DIG Cell Phone Snatched : రాష్ట్ర పోలీస్​ డీఐజీ మొబైల్​నే ఎత్తుకెళ్లాడు ఓ దొంగ. బైక్​పై వచ్చిన దొంగ.. మార్నింగ్​ వాకింగ్​కు వచ్చిన డీఐజీ నుంచి ఫోన్ చోరీ చేశాడు. పోలీస్ హెడ్​క్వాటర్స్​ సమీపంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆదివారం అసోంలో ఈ ఘటన జరిగింది. డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (లా & ఆర్డర్) వివేక్ రాజ్ సింగ్ మొబైల్​ను ఎత్తుకెళ్లాడు దొంగ.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజధాని గుహవాటిలోని ఉలుబరి ప్రాంతంలోని మజార్ రోడ్​లో ఈ ఘటన జరిగింది. ఉన్నతాధికారుల నివాసాలు మజార్​ రోడ్డుకు ఇరువైపుల ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే డీఐజీ మార్నింగ్ వాక్ చేస్తుండగా వచ్చిన దొంగ.. ఆయన ఫోన్​ను ఎత్తుకెళ్లాడు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు వారు వెల్లడించారు. మొబైల్​ చోరీ దొంగలను పట్టుకునేందుకు ఓ టీం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా అయితే ఘటనపై మాట్లాడేందుకు పలువురు అధికారులు నిరాకరించారు.

పక్క ఊరి ట్రాన్స్​ఫార్మర్​ చోరీ

పక్క ఊరి ట్రాన్స్​ఫార్మర్​ చోరీ..
transformer theft in uttar pradesh : ఓ గ్రామానికి చెందిన ట్రాన్స్​ఫార్మర్​ను మరో గ్రామానికి చెందిన వ్యక్తులు ఎత్తుకెళ్లారు. వరద నీటిలో ఉన్న ట్రాన్స్​ఫార్మర్​ను బోటుపై వచ్చి ఎత్తుకెళ్లారు. ఉత్తర్​ప్రదేశ్​లోని ఫరూఖాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ట్రాన్స్​ఫార్మర్​ను ఎత్తుకెళ్లినట్లు నిందితులు చెబుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాయంగంజ్​ ప్రాంతం పరిధిలోని మున్షీ నాగ్లా గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. జులై 19న ఘటనపై గ్రామ సర్పంచ్​ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల విచారణలో జితేంద్ర, దాల్ సింగ్, శివరామ్, మౌజిలాల్, రామ్​ రాహిశ్​తో పాటు మరికొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు మున్షీ నాగ్లా గ్రామంలో అమర్చిన 25 KVA ట్రాన్స్‌ఫార్మర్‌ను ఎత్తుకెళ్లినట్లు తేలింది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో.. సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

చోరీకి ఇదే కారణం..
భారీ వర్షాల కారణంగా ఉత్తర్​ప్రదేశ్​లో గంగానది పొంగిపొర్లుతోంది. చాలా గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. దీంతో పలు గ్రామాలకు విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలోనే నగరియ బసోలా గ్రామంలో ఇటీవలే ఓ ట్రాన్స్​ఫార్మర్​ కాలిపోయింది. దీనిపై విద్యుత్​ శాఖ అధికారులకు గ్రామస్థులు ఎంత మొరపెట్టుకున్న వారు స్పందించలేదు. ఇక చేసేది లేక సమస్యపై ఏకమైన గ్రామస్థులు.. మున్షీ నాగ్లా గ్రామానికి చెందిన ట్రాన్స్​ఫార్మర్​ను బోటుపై వచ్చి ఎత్తుకెళ్లారు. వరదల కారణంగా ఆ ట్రాన్స్​ఫార్మర్​కు విద్యుత్​ సరాఫరాను నిలిపివేశారు అధికారులు. దీంతో వారి సులభంగా పూర్తి అయింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.