ETV Bharat / bharat

'కశ్మీర్​లో యాక్టివ్​గా 200 మంది ఉగ్రవాదులు'

author img

By

Published : Mar 14, 2021, 10:16 AM IST

జమ్ముకశ్మీర్​లో ప్రస్తుతం దాదాపు 200 మంది ముష్కరులు క్రియాశీలకంగా ఉన్నారని డీజీపీ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. మరో 250 మంది.. సరిహద్దుల్లో ప్రవేశించేందుకు ఎదురుచూస్తున్నారని చెప్పారు.

Around 200 terrorists active in J&K; another 250 in launch pads across LoC: DGP
'కశ్మీర్​లో యాక్టివ్​గా 200 మంది ఉగ్రవాదులు'

జమ్ముకశ్మీర్​లో దాదాపు 200 మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని జమ్ముకశ్మీర్​ డీజీపీ దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. నిఘావర్గాల సమాచారం ప్రకారం.. మరో 250 మంది సరిహద్దు ద్వారా ముష్కర దళంలో ప్రవేశించేందుకు ఎదురు చూస్తున్నారని చెప్పారు. జమ్ముకశ్మీర్​ పోలీస్​ హెడ్​ క్వార్టర్స్​లో ఇంటర్​ జోన్​ స్పోర్ట్స్ మీట్​ను ఆయన ప్రారంభించారు.

హిమాలయాల్లో ప్రశాంతతను భంగం చేయాలని యత్నిస్తున్న పొరుగుదేశ కుట్రలను ఎదుర్కొనేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని దిల్బాగ్​ సింగ్​ తెలిపారు. హిమాలయాల్లో జూన్​ 28 నుంచి ప్రారంభం కానున్న అమర్​నాథ్​ యాత్ర కోసం.. అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. గతేడాదిలాగే ఈసారి కూడా క్రియాశీల ఉగ్రవాదుల సంఖ్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2020-21లో అనేక నార్కో టెర్రరిజం కేసులను వెలికితీశామని.. వీటిపై దర్యాప్తు చేపట్టామని తెలిపారు.

ఇదీ చూడండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​- ఓ ఉగ్రవాది హతం

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.