జమ్ముకశ్మీర్ పూంఛ్‌లో ఎదురుకాల్పులు జరిగాయి. భటా ధూరియన్ గ్రామంలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన కాల్పుల్లో.. ఓ జవాను వీరమరణం పొందినట్లు అధికారులు తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతమైన దేరా కి గాలీలో సోమవారం కూడా కాల్పులు జరిగాయి. ఇందులో ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
భీంబర్ గాలిలోని ఆర్మీ ఇన్‌స్టాలేషన్‌కు సమీపంలో ఉన్న భటా ధూరియన్ గ్రామంలో అధికారులు సెర్చ్ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి. ఒక జవాను చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి.
ఘటనాస్థలికి సమీపంలో ఉన్న ప్రాంతాన్ని సైన్యం తమ అధీనంలోకి తెచ్చుకుంది.
ఇదీ చూడండి: 'మరోసారి మెరుపుదాడులు తప్పవు'- పాక్‌కు షా హెచ్చరిక!