తమిళనాడు అరవకురిచి నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి అన్నామళై.. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన గోడ ప్రకటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ పేరును తొలగించారు. అంతకుముందు 'మోదీ దీవెనతో' అని పెద్ద పెద్ద అక్షరాలతో నియోజకవర్గం మొత్తం గోడ ప్రకటనలు చేసిన అన్నామళై.. తాజాగా ప్రధాని పేరును చెరిపేసి.. ఆ స్థానంలో తమిళనాడులో 'అమ్మ'గా పిలిచే జయలలిత పేరును రాశారు. ఈ చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
కారణం ఇదే..!
మొదట్లో 'మోదీ దీవెనతో' అంటూ ప్రచారం నిర్వహించిన అన్నామళై.. తరువాత రూట్ మార్చి.. 'అమ్మ దీవెన' పేరుతో ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నారు. అరవకురిచి నియోజకవర్గంలోని అరవకురిచి, పళ్లపట్టీ, చిన్నతరపురం, ఈసనాతమ్ ప్రాంతాల్లో అధిక శాతం ముస్లిం ఓటర్లు ఉన్నారు. అయితే మోదీ.. ఫేమ్ కంటే.. అమ్మ పేరుతోనే ఆ ఓటర్లను ఆకర్షించవచ్చని భావిస్తున్నారు అన్నామళై. అందుకే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారంలో అమ్మ పేరుతో పాటు తన స్వయంకృషితో సాధించిన విజయాలను సైతం.. వీడియో రూపంలో ప్రజలకు వివరిస్తున్నారు.
ఇదీ చదవండి : 'సీఎం తల్లినే అవమానించిన వారు మహిళల్ని గౌరవిస్తారా?'