ETV Bharat / bharat

జగన్‌ మాటలకు చేతలకు పొంతన కరవు-అటకెక్కిన డ్రోన్‌ పంపిణీ ప్రాజెక్టు - రైతు భరోసా కేంద్రాలకు డ్రోన్లు

AP CM Jagan Cheated Farmers: ఆంధ్రప్రదేశ్​లో ప్రతీ రైతు భరోసా కేంద్రానికి డ్రోన్‌! సాగురంగానికి డ్రోన్లతో సాంకేతిక హంగులు అద్దుతాం! కానీ జరిగిదేంటంటే మాటలు కోటలు దాటినా డ్రోన్లు మాత్రం అడుగు కూడా ఎగరలేదు. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఇస్తామన్న డ్రోన్లు ఏడాదిన్నరగా ఆయనే సృష్టించుకున్న ఊహాలోకంలోనే ఎగురుతూనే ఉన్నాయి. రైతులకు మాత్రం కనిపించవు. నేలకు దిగవు. అయినా గొప్ప రోజులు రాబోతున్నాయంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు మన సీఎం సారు.

AP_CM_Jagan_Cheated_Farmers
AP_CM_Jagan_Cheated_Farmers
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 9:28 AM IST

Updated : Dec 27, 2023, 1:07 PM IST

జగన్‌ మాటలకు చేతలకు పొంతన కరవు-అటకెక్కిన డ్రోన్‌ పంపిణీ ప్రాజెక్టు

AP CM Jagan Cheated Farmers : ఈ ఏడాది జూన్‌ 1న ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు జిల్లా పత్తికొండలో రైతు భరోసా విడుదల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రగల్భాలాలు పలికారు. వ్యవసాయ రంగంలో మొదటిసారిగా RBK స్థాయిలోనే డ్రోన్లు తీసుకొస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. ఆకాశమేహద్దుగా ఇచ్చిన ఆర్భాటపు హామీలే తప్ప డ్రోన్లు ఎగరలేదు. ప్రభుత్వ పదవీకాలం పూర్తి కావస్తున్నా ఒక్క డ్రోన్‌ ఇవ్వలేదు. అసలేమి ఇవ్వకున్నా గొప్ప అడుగులు పడుతున్నాయని, గొప్ప రోజులు రాబోతున్నాయని మన ముఖ్యమంత్రి జగన్‌ ఏడాదిన్నరగా ఊరిస్తూనే ఉన్నారు. ఇదిగో జులై, అదిగో ఆగస్టులో ఇవ్వబోతున్నామని చెబుతూ చివరకు ఈ డ్రోన్ల సామర్థ్యం సరిపోదంటూ పక్కన పెట్టేశారు. శిక్షణతోనే సరిపెట్టారు. CM చెప్పే మాటలకు చేతలకు ఎంత తేడా ఉంటుందో చెప్పేందుకు ఇది ఓ నిదర్శనంగా నిలిచింది.

YSRCP Government Not Distributed Drones To Rythu Bharosa Kendras : రైతు భరోసా కేంద్రానికి ఒక డ్రోన్‌ చొప్పున రాష్ట్రంలోని 10వేల778 ఆర్‌బీకేలకు డ్రోన్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి జగన్‌ హామీ అటకెక్కేసింది. RBKకు ఒక డ్రోన్‌ చొప్పున ఇచ్చినా మొత్తం వ్యయం 1,070 కోట్లు. అందులో 50శాతం రాయితీ ప్రకారం చూసినా కేంద్ర, రాష్ట్రాల వాటా 500 కోట్లు అందులోనూ కేంద్రం ఇచ్చేదే అధికం. రాష్ట్రం కనీసం 100 కోట్లు ఖర్చు పెట్టినా డ్రోన్‌ ప్రాజెక్టుకు అడుగులు పడేవి. అయితే రైతుల కోసం ఆ మాత్రం కూడా జగన్‌ ప్రభుత్వం ఖర్చు చేయలేదు.

Rythu Bharosa Centers are not Useful to Farmers: రైతుకి భరోసా ఇవ్వని కేంద్రాలు.. వేల కోట్లు వెచ్చించినా సేవలు మాత్రం డొల్లే

Rythu Bharosa Kendras in Andhra Pradesh : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో యాంత్రీకరణ సహా పలు పథకాలను అటకెక్కించింది. కనీసం టార్పాలిన్లు, స్ప్రేయర్లు, ఆధునిక యంత్ర పరికరాలు కూడా ఇవ్వలేమంటూ చేతులెత్తేశారు. సామాజిక అద్దెయంత్ర కేంద్రాలు-CHC పేరుతో వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలకు మాత్రం కొన్ని పరికరాల్ని కట్టబెట్టి అదే యాంత్రీకరణ అంటూ జబ్బలు చరచుకుంటున్నారు. చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గిస్తే వారి ఆదాయం పెరుగుతుందనే ఆలోచన కూడా ముఖ్యమంత్రి జగన్‌కు లేకపోయింది.

వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 10వేల 778 ఆర్‌బీకేలను ఏర్పాటు చేసింది. వాటికి ఒక్కో దానికి ఒక్కటి చొప్పున డ్రోన్‌ ఇస్తామని జగన్‌ గతేడాది ప్రకటించారు. తొలి విడత కింద 2023 డిసెంబరు నాటికి 2వేల డ్రోన్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ప్రాజెక్టు అడుగు కూడా ముందుకు పడలేదు. ఒక్కో డ్రోన్‌ వ్యయం 10లక్షలుగా నిర్ణయించారు. అందులో ప్రభుత్వం 5లక్షలు రాయితీగా భరిస్తుంది.

Rythu bharosa kendram: చెప్పేవన్నీ గొప్పులు.. ఆర్బీకేల్లో రైతులకు అందని సేవలు

రైతు ఉత్పత్తి సంస్థలు, సీహెచ్‌సీలు, గ్రామీణ పారిశ్రామికవేత్తలకు మొత్తం డ్రోన్‌ వ్యయంలో 4లక్షలు రాయితీగా ఇచ్చేందుకు కేంద్రం ముందుకొచ్చింది. మహిళలకైతే 50శాతం రాయితీ ఇస్తుంది. అంటే రాష్ట్రం భరించేదేమీ ఉండదు. మిగిలిన మొత్తాన్ని రైతులు భరిస్తారు. డ్రోన్‌ ప్రాజెక్టు అమల్లో భాగంగా ఔత్సాహికుల్ని ఎంపిక చేసి వారికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో శిక్షణ ఇప్పించారు. ఇప్పటికి సుమారు 200 మందికి పైగా శిక్షణ పూర్తయింది. డ్రోన్‌ మాత్రం ఇవ్వలేదు.

ఉట్టికి ఎగరలేనమ్మ ఆకాశానికి ఎగిరినట్లుగా చెప్పిన డ్రోన్లు ఇవ్వని జగన్‌ సర్కార్‌ మరింత ఆధునికమైనవి ఇస్తామన్న ప్రచారాన్ని తెరపైకి తెచ్చింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డ్రోన్లు సుమారు 15 నిమిషాల వరకు పొలంపై ఎగిరి రెండున్నర ఎకరాల వరకు పురుగుమందుల్ని పిచికారి చేయగలదు.

ఇటీవల జరిగిన సమీక్షా సమావేశంలో ఎక్కువ సమయం గాల్లో ఎగురుతూ ఉండే డ్రోన్‌ను రైతులకు ఇవ్వాలనే ప్రతిపాదనలు వచ్చాయి. కనీసం అరగంట అయినా గాలిలో ఎగరాలని సూచించారు. ఇందుకోసం యూనిట్‌ ధర కనీసం 20లక్షలకు పైమాటే. అంత మొత్తంతో కొనుగోలు చేసినా.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ మాత్రం పెరగదు. కనీసం 15లక్షలైనా రైతులు చెల్లించాలి. అది తలకు మించిన భారమే అవుతుంది. ఈ నేపథ్యంలో డ్రోన్ల పంపిణీ పక్కన పెట్టేశారు. పరిస్థితి చూస్తుంటే ఈ ఏడాదే కాదు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే అమలయ్యే పరిస్థితి లేకుండా పోయింది.

ఆర్బీకేలో అక్రమాలు.. గంజాయి కేసుల్లో పెద్ద తలకాయలు: నాదెండ్ల మనోహర్

Last Updated : Dec 27, 2023, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.