ETV Bharat / bharat

వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం - కృష్ణాబోర్డు పరిధిలోకి ఉమ్మడి ప్రాజెక్టులు

AP and Telangana Projects Comes Under KRMB: తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణానదీ జలాల వివాదంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయాలని త్రిసభ్య కమిటీకి బాధ్యతలు అప్పగించింది.

AP_and_Telangana_Projects_Comes_Under_KRMB

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:41 AM IST

AP and Telangana Projects Comes Under KRMB: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రాజెక్టులు కేంద్రం పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇరు రాష్ట్రల మద్య నెలకొన్న వివాదల నేపథ్యంలోనే సాగునీటి ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి శాఖ నిర్ణయించింది. నెలరోజుల్లో ఈ ప్రాజెక్టులను కేఆర్​ఎంబీకి అప్పగించాలని దిల్లీలో జరిగిన సమావేశంలో నిర్ణయించినట్లు ఏపీ రాష్ట్ర జల వనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ వెల్లడించారు. అప్పగింతకు సంబంధించిన విధివిధానాలను వచ్చే వారంలోగా ఖరారు చేయాలని వారు ఆదేశించారు. కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించాలని, విధానాలను చర్చించి, అప్పగింతలను ఖరారు చేసేందుకు రెండు వారాల్లోగా కార్యదర్శుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఈ మొత్తం ప్రక్రియను నెలరోజుల్లో ముగించేందుకు కేంద్ర జలశక్తి శాఖ

తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వివాదానికి సంబంధించిన సమావేశం కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ నేతృత్వంలో బుధవారం దిల్లీలో జరిగింది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కుడి కాలువ అవుట్‌లెట్‌ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌ భూభాగంలో ఉన్న గేట్లను నవంబరు నెలాఖరులో ఏపీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుడి కాలువకు స్వయంగా నీటిని విడుదల చేశారు. ఏపీ పోలీసు అధికారుల నేతృత్వంలో జల వనరులశాఖ అధికారులు ఈ గేట్లు స్వాధీనం చేసుకున్న అంశం చర్చనీయాంశమైంది. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం తలెత్తి పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. దీంతో కేంద్ర జలశక్తి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖలు కలగజేసుకున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో దిల్లీలో సమావేశం నిర్వహించాయి.

KRMB Meeting : దిల్లీకి చేరిన కృష్ణా జలాల వాటాల పంచాయితీ

ఉమ్మడి ప్రాజెక్టులు, అవుట్‌లెట్‌లను కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల క్రితం గుర్తించి వాటిని కృష్ణా బోర్డు పరిధిలో చేర్చాలంటూ నోటిఫై చేసిందని శశిభూషణ్‌ కుమార్‌ తెలిపారు. దీనికి సమ్మతి తెలియజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసిందన్నారు. అయినా ఇంతవరకు ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి తీసుకురాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ వెనక్కి వెళ్లకుండా గతంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఉమ్మడి ప్రాజెక్టులను కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకురావాలని శశిభూషణ్‌ కుమార్‌ కోరారు. మరోవైపు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విషయంలో నవంబరు 29వ తేదీకి ముందు ఏ పరిస్థితి ఉందో దానిని పునరుద్ధరించాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది.

ఇందుకు ఏపీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్ర జలశక్తి కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ కూడా తెలంగాణ వాదనతో ఏకీభవించలేదని ఏపీ అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్‌పై నవంబరు 29కి ముందు ఉన్న పరిస్థితిని తీసుకురావడం అనేది అర్థరహితమని కేంద్ర కార్యదర్శి సైతం అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు రెండు నెలల సమయం కావాలని తెలంగాణ అధికారులు కోరినట్లు తెలిసింది. ఇందుకు ఏపీ అధికారులు సమ్మతించలేదు. గడువు తీసుకుంటే అప్పటికి ఎన్నికలు వస్తాయని, ఆ సమయంలో ఈ ప్రక్రియ పూర్తి చేయడం సాధ్యం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నెల రోజుల్లోనే ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించే ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు.

సాగర్ కుడికాలువ నుంచి నీరు తీసుకోవడం ఆపాలి - ఏపీకి కృష్ణా బోర్డు అదేశం

కృష్ణా బోర్డులో ఇప్పటికే త్రిసభ్య కమిటీ వివిధ అంశాలపై సమావేశాలు, చర్చలు నిర్వహిస్తోంది. రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌లు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఇందులో సభ్యులు. త్రిసభ్య కమిటీ సమావేశమై వారం రోజుల్లోగా ఉమ్మడి ప్రాజెక్టుల అప్పగింతకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాల్సి ఉంటుంది. ఆ తరవాత రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శులతో కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి సమావేశం నిర్వహించి త్రిసభ్య కమిటీ నివేదికపై చర్చించి తుది రూపు ఇస్తారు.

నెల రోజుల్లోగా నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టులకు సంబంధించిన మొత్తం 15 అవుట్‌లెట్‌ల అప్పగింత ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ అధికారులు తెలిపారు. తొలుత నాగార్జునసాగర్‌ను అప్పగించి ఆ తర్వాత శ్రీశైలం ప్రాజెక్టును అప్పగించాలనే ప్రతిపాదన రాగా ఇందుకు కూడా ఏపీ అధికారులు అంగీకరించలేదు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల అప్పగింత ఒకేసారి పూర్తి కావాలని కోరారు.

50% వాటా జలాలు కేటాయించాల్సిందే.. కృష్ణా బోర్డు సమావేశ ఎజెండాలో తెలంగాణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.