ETV Bharat / bharat

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case: జగన్​ తమ్ముడికి ఒక రూల్​.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా! - చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case : అసలు కారణమే చెప్పకుండా టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. ఎంతో హడావిడిగా ఖాకీ డ్రస్సులు.. చేసిన పనికి ఎన్నో విమర్శలు వెల్లువెత్తున్నాయి. అదే పని ఎందుకు వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్​ రెడ్డికి చేయడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్​ తమ్ముడిని అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఐకి.. ఏపీ ఖాకీలు మోకాళ్లు అడ్డితే.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్టులో అదే పోలీసులు ముందుండి నడిపించారు.

Nara Chandrababu Naidu Arrested in Fraud Case
Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 10, 2023, 8:11 AM IST

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case జగన్​ తమ్ముడికి ఒక రూల్​.. ప్రతిపక్ష నాయకుడికి ఒక రూలా!

Andhra Ex CM Nara Chandrababu Naidu Arrested in Fraud Case : అదే ఖాకీ డ్రస్సు.. అదే టోపీ.. అదే లాఠీ..! కానీ పోలీస్‌ తీరే వేరు..! నచ్చితే ఒకలా, నచ్చకపోతే మరోలా..! అధికారపార్టీ అయితే ఒకలా, ప్రతిపక్షమైతే మరోలా పని చేస్తారు..! వివేకా హత్య(YS Viveka Murder Case) కేసులో నిందితుడైన అవినాష్‌రెడ్డిని సీబీఐ(CBI) అరెస్టు చేయకుండా మోకాలడ్డిన అదే పోలీసులు.. చంద్రబాబు అరాచక అరెస్టుకు మాత్రం పూర్తిగా సహకరించారు.

ఈ సీన్‌ గుర్తుందా! ఆస్పత్రి ఆవరణలో వైఎస్​అవినాష్‌రెడ్డి(YS Avinash Reddy).. ఆస్పత్రి బయట వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, ఆ పార్టీ నేత ఎస్వీ మోహన్‌ రెడ్డి.. చుట్టూ అధికార పార్టీ అనుచరగణం. గుర్తొచ్చింది కదూ..! బాబాయ్‌ వివేకానంద హత్యకేసులో నిందితుడు అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు .. ఆడిన జగన్నాటకంలో రక్తికట్టించిన సీన్‌ ఇది. అవినాష్‌రెడ్డి అమ్మకు అనారోగ్యం పేరిట అప్పట్లో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో దాదాపు 8రోజులపాటు.. హైడ్రామా నడిచారు. అనుచరుల్ని మోహరించారు. వాళ్లను ముప్పూటలా మేపి.. హంగామా సృష్టించారు. ఇలా సీబీఐనే ముప్పుతిప్పలు పెట్టి.. 3చెరువుల నీరు తాగించారు. అవినాష్‌పై చర్యలు తీసుకుంటే.. భద్రత కల్పించలేమంటూ రాష్ట్ర పోలీసులతోనే చెప్పించి.. సీబీఐనే ఇంటిదారి పట్టించారు.

Chandrababu Vs Avinash Reddy : ఇప్పుడు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును పరిశీలిద్దాం. 14ఏళ్లు సీఎంగా, 9 ఏళ్లు ప్రతిపక్షనేతగా పనిచేసిన చంద్రబాబును అరెస్టు చేసేందుకు.. అర్ధరాత్రి దండెత్తారు. కేసేమిటో చెప్పలేదు. అసలు ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో ఆధారాలూ కూడా చూపలేదు. పైగా మీకెందుకు చెప్పాలంటూ ఎదురుదాడికి దిగారు. ఎన్​ఐఏ అభ్యంతరం చెప్తున్నా వినకుండా.. చంద్రబాబు నిద్రిస్తుండగా బస్సు వద్దకు వెళ్లారు. నిద్రలేవాలంటూ.. బస్సు తలుపుకొట్టారు.

Ganta Srinivasa Rao Arrested: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు..!

Police Cooperation in Arresting Chandrababu : వీఐపీ ప్రొటోకాల్​ ప్రకారం.. ఉదయం 5.30 వరకూ చంద్రబాబును డిస్టర్బ్​ చేయరాదని ఎన్​ఐఏ అధికారులు తేల్చి చెప్పారు. అయితే అప్పటిదాకా బస్సు వద్దే వేచి గుంట కాడ నక్కల్లా వేచి ఉన్నారు. నాయకులు, కార్యకర్తలు అడ్డుపడకుండా.. ముందే అరెస్టు చేసేశారు. చంద్రబాబు ప్రజాస్వామ్యంపై గౌరవం ఉందంటూ.. వెంటనే పోలీసుల వెంట బయలు దేరారు. ఈ క్రమంలో వేల సంఖ్యలో కార్యకర్తలు అడుగడుగునా అడ్డుపడినా.. చట్టాన్ని గౌరవించి దారివ్వాలని వారికి విజ్ఞప్తి చేశారు.

TDP Chief Chandrababu Arrested by CID : అధికార, ప్రతిపక్షాల విషయంలో పోలీసుల తీరెలా ఉందో.. చెప్పేందుకు ఉమ్మడి కర్నూల్​ జిల్లాలో వంద రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలే నిదర్శనం. వివేకా నంద హత్య కేసులో అవినాశ్​ రెడ్డి అరెస్టుకు.. సీబీఐకి సహకరించలేమని పోలీసులు చేతులెత్తేశారు. చంద్రబాబు అరెస్టుకు మాత్రం పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. అప్పుడు సీఎం జగన్​ తమ్ముడైన ఎంపీ అవినాష్​ రెడ్డిని కాపాడి రాష్ట్ర పరువును మంటగలిపిందీ. కానీ ఇప్పుడు 74 ఏళ్ల వయసున్న చంద్రబాబు అరెస్టుకు సహకరించిందీ కూడా అదే పోలీస్​ యంత్రాంగం. ఎంపీపై అలవిమాలిన ప్రేమ ఒలకబోయడానికి, ఇప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబు అరెస్టు విషయంలో రెట్టించిన ఉత్సాహంతో వ్యవహరించడానికి కారణమనది జగమెరిగిన సత్యమే.

TDP Chief Nara Chandrababu Naidu Arrest: ఆంధ్రా కిమ్​ అరాచకీయం.. పైశాచిక ఆనందం కోసమే చంద్రబాబు అరెస్టు

Pawan Kalyan on Chandrababu Arrest: మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్న పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.