కరోనా నేపథ్యంలో జూమ్ వీడియో కాలింగ్‌లు విపరీతంగా పెరిగిపోయాయి. ముఖ్యమైన కార్యక్రమాలు సైతం జూమ్ వేదికగానే నిర్వహిస్తున్నారు. అయితే.. ఇలాంటి జూమ్ కాల్లో ఉండగానే ఓ వ్యక్తికి తన భార్య ప్రేమగా ఓ చిలిపి ముద్దు ఇచ్చేందుకు వచ్చింది. అయితే.. 'వీడియో ఆన్‌లో ఉంది. నీకెమన్నా పిచ్చిపట్టిందా!' అంటూ తన భార్యను అసహ్యించుకున్నాడు ఆ వ్యక్తి. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారి అందరినీ కడుపుబ్బా నవ్విస్తోంది. సంబంధిత వీడియోను ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్ మహీంద్రా కూడా నెట్టింట పంచుకున్నారు.
-
Haha. I nominate the lady as the Wife of the Year. And if the husband had been more indulgent and flattered, I would have nominated them for Couple of the Year but he forfeited that because of his grouchiness! @hvgoenka https://t.co/MVCnAM0L3W
— anand mahindra (@anandmahindra) February 19, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Haha. I nominate the lady as the Wife of the Year. And if the husband had been more indulgent and flattered, I would have nominated them for Couple of the Year but he forfeited that because of his grouchiness! @hvgoenka https://t.co/MVCnAM0L3W
— anand mahindra (@anandmahindra) February 19, 2021Haha. I nominate the lady as the Wife of the Year. And if the husband had been more indulgent and flattered, I would have nominated them for Couple of the Year but he forfeited that because of his grouchiness! @hvgoenka https://t.co/MVCnAM0L3W
— anand mahindra (@anandmahindra) February 19, 2021
'ఉత్తమ భార్య తనే..'
ఈ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా ఓ ఫన్నీ కామెంట్ చేశారు. "ఈ ఏడాది ఉత్తమ భార్యగా ఈమెనే నామినేట్ చేస్తున్నా. ఒకవేళ ఆ వ్యక్తి కూడా తన భార్యకు ప్రేమ చూపించి ఉంటే ఉత్తమ జంటగా వారిని నామినేట్ చేసే వాడిని. కానీ, భార్యను అసహ్యించుకొని ఆ వ్యక్తి ఈ అవకాశాన్ని కోల్పోయాడు." అని ట్వీట్ చేశారు.
అయితే.. వీడియోలో ఉన్న ఆ జంట మరీ యుక్త వయసులో లేకపోవడం నెటిజన్లను మరింత ఆకర్షిస్తోంది.
ఇదీ చదవండి:ఎన్నికల వేళ 'మెట్రో' ధరలు తగ్గించిన సీఎం