చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో మోహరించిన సైనికుల భద్రత కోసం కేేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. చలికాలం ప్రారంభమైన నేపథ్యంలో సైనిక బలగాలకు అతి శీతల వాతావరణంలో ధరించే దుస్తులను అందజేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అత్యంత చలి వాతావరణంలో ధరించే దస్తులతో ఉన్న జవాను ఫొటోను అధికారులు విడుదల చేశారు. ఇవి అత్యంత శీతల పరిస్థితుల్లో కూడా సైన్యం తట్టుకొని నిలబడి ఉండటానికి దోహదం చేస్తాయి. ఈ దుస్తులను అమెరికా నుంచి తెప్పించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చూడండి: సైన్యానికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు..