ETV Bharat / bharat

Article 370: దిగ్విజయ్ వ్యాఖ్యలపై దుమారం - కశ్మీర్ ఆర్టికల్ 370 దిగ్విజయ్ సింగ్

ఆర్టికల్ 370 రద్దుపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ప్రత్యేక హోదా రద్దు అంశంపై కాంగ్రెస్ పునరాలోచిస్తుందని దిగ్విజయ్ పేర్కొనడంపై భాజపా మండిపడింది. గతంలోనూ పాకిస్థాన్​కు అనుకూలంగా దిగ్విజయ్ మాట్లాడారని ఎదురుదాడికి దిగింది.

Alleged Clubhouse chat leak of Congress' Digvijaya Singh creates political storm over Article 370
Article 370: దిగ్విజయ్ వ్యాఖ్యలపై దుమారం
author img

By

Published : Jun 12, 2021, 3:43 PM IST

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 రద్దు అంశంపై పునరాలోచిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రకటనపై భాజపా మండిపడింది. ఇదంతా టూల్​కిట్​లో భాగమేనని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పార్టీ తన పేరును దేశ వ్యతిరేక క్లబ్​హౌస్​గా మార్చుకోవాలని చురకలంటించారు.

దిగ్విజయ్ సింగ్ ఓ పాకిస్థానీ జర్నలిస్ట్​తో మాట్లాడారని ఆరోపిస్తూ ఓ క్లబ్​హౌస్ చాట్​ను బహిర్గతం చేశారు భాజపా నేత అమిత్ మాలవీయ. దీనిపై స్పందించిన భాజపా జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర.. కాంగ్రెస్ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు.

Alleged Clubhouse chat leak of Congress' Digvijaya Singh creates political storm over Article 370
మాలవీయ ట్వీట్

"ఇదే దిగ్విజయ్ సింగ్ గతంలో పుల్వామా దాడిని ప్రమాదంగా పేర్కొన్నారు. 26/11 దాడులను ఆరెస్సెస్ కుట్ర అని అభివర్ణించారు. ఆ సమయంలో పాకిస్థాన్​కు క్లీన్​ చిట్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడేమో.. మోదీ గద్దెదిగి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తామని ఆయన చెబుతున్నారు. ఇదంతా టూల్​కిట్​లో భాగం."

- సంబిత్ పాత్ర, భాజపా ప్రతినిధి

దిగ్విజయ్ వ్యాఖ్యలను జమ్ముకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం కవీందర్ గుప్తా ఖండించారు. కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ భాషలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్ సైతం ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని కోరుకుంటోందని అన్నారు.

క్లబ్​హౌస్​లో పాల్గొన్న సభ్యులు

మరోవైపు, కశ్మీరీల నుంచి దేశభక్తిని నేర్చుకోవాలంటూ దిగ్విజయ్​కు చురకలంటించారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్​ పూరి.

దిగ్విజయ్ ఏమన్నారంటే?

ఆర్టికల్ 370 రద్దు చేయడం, జమ్ముకశ్మీర్​ను కేంద్ర పాలిత ప్రాంతంగా విభజించడం బాధాకరమని దిగ్విజయ్ పేర్కొన్నారు. ఓ క్లబ్​హౌస్​ చాట్​లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కశ్మీర్​లో ప్రజాస్వామ్యం, మానవత్వం నశించాయని.. ప్రతి ఒక్కరినీ నిర్బంధించారని అన్నారు. ప్రభుత్వ సర్వీస్​లలో కశ్మీర్ పండిట్లకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ విషయంపై తప్పక దృష్టిసారిస్తుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 370 రద్దును కశ్మీరీలు ఆమోదించినట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.