ETV Bharat / bharat

All Women Team Satellite : సత్తా చాటిన మహిళలు​..​ సూపర్​ 'శాటిలైట్'​ రెడీ.. త్వరలోనే ఇస్రో ప్రయోగం

All Women Team Satellite : కేరళలోని ఓ ఇంజినీరింగ్​ కాలేజీ విద్యార్థినులు, ఉపాధ్యాయుల బృందం.. మూడేళ్ల కష్టపడి ఓ 'విశాట్​' అనే ఉప్రగ్రహాన్ని తయారు చేసింది. పూర్తిగా మహిళల బృందం తయారు చేసిన వాతావరణ అధ్యయన ఉపగ్రహం వచ్చే నెలలో నింగిలోకి దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.

All Women Team Satellite
All Women Team Satellite
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 14, 2023, 10:37 PM IST

Updated : Sep 14, 2023, 11:00 PM IST

All Women Team Satellite : అద్భుతమైన ఆవిష్కరణలతో అంతరిక్ష రంగంలో భారత్​ దూసుకెళ్తోంది. ఈ తరుణంలో మహిళలు సైతం ఆకాశమే లక్ష్యంగా ఆవిష్కరణలతో సత్తా చాటుతున్నారు. అలాంటి కోవకు చెందిన మహిళల బృందం తయారు చేసిన ఉపగ్రహాన్ని త్వరలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ- ఇస్రో ఆంతరిక్షంలోకి ప్రయోగించనుంది. ఈ సాటిలైట్​ను ఇస్రో రేసుగుర్రం పీఎస్​ఎల్​వీ వాహక నౌక ద్వారా నింగిలోకి పంపించనున్నారు. ఈ ప్రయోగం ఆక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో చేపట్టే అవకాశం ఉంది.

తిరువనంతపురంలోని పూజప్పురాలో ఉన్న ఎల్​బీఎస్ మహిళల​ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఓ బృందంగా ఏర్పాడి స్పేస్​ క్లబ్​ను స్థాపించారు. వీరంతా కలిసి 'వియ్​శాట్​' (WESAT) అనే ఉపగ్రహాన్ని స్వయంగా డిజైన్ చేసి.. అభివృద్ధి చేశారు. కేరళ వాతావరణ మార్పులపై అతినీలలోహిత కిరణాల ప్రభావాన్ని గమనించే ఉద్దేశంతో ఈ ఉపగ్రహాన్ని అభివృద్ధి చేశారు. బాహ్య అంతరిక్షంలో, భూఉపరితలంపై అతినీలలోహిత రేడియేషన్ స్థాయిని కొలవడం.. దాని వల్ల వాతావరణంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయడమే లక్ష్యంగా ఈ ఉపగ్రహాన్ని తయారు చేశారు. కాలేజీ క్యాంపస్​లో ఇన్​స్టాల్​ చేసిన పరికరాల ద్వారా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఎల్​బీఎస్ ఇంజినీరింగ్ విద్యార్థినులు ఉపగ్రహాన్ని తయారుచేసిన విషయం తెలిసిన తర్వాత.. మిగతా కాలేజీల విద్యార్థులు కూడా ఈ సాటిలైట్​ గురుంచి చాలా ప్రశ్నలను అడుగుతున్నారు. దీనికి సంబంధించిన విషయాలు ఉత్సాహంగా తెలుసుకుంటున్నారు. అయితే, ఈ 'వియ్​శాట్​' తయారుచేయడానికి ఎల్​బీఎస్​ కాలేజీ విద్యార్థినులు మూడేళ్లు కష్టపడ్డారు. ఈ ఆలోచన వచ్చిన తర్వాత ఇస్రోకు లేఖ రాశారు. అనంతరం తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్​ సెంటర్ సహకారంతో ఆ ప్రయత్నం పూర్తయింది. ఈ మేరకు ఎల్​బీఎస్​ కాలేజీ, ఇస్రో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి.

చంద్రయాన్-3 విజయం.. మహిళ శక్తికి నిదర్శనం : ప్రధాని మోదీ
చంద్రయాన్‌-3లోనూ మహిళల కీలక పాత్ర పోషించారు. దీనిపై స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. భారత్‌లో మహిళా శక్తికి చంద్రయాన్‌-3 విజయం ప్రత్యక్ష ఉదాహరణ అని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవల మన్‌కీబాత్‌ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. చంద్రయాన్‌-3 మిషన్‌లో అనేక మంది మహిళా శాస్త్రవేత్తల కృషి ఉన్నట్లు తెలిపారు. అనంతంగా భావించే అంతరిక్షాన్ని కూడా భారత మహిళలు సవాలు చేస్తున్నారని చెప్పారు. పూర్తి కథనం కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

'మహిళాశక్తికి 'చంద్రయాన్​-3' విజయం ప్రత్యక్ష ఉదాహరణ'

Who Named Site on the Moon : చంద్రుడిపై ప్రదేశాలకు పేర్లు ఎవరు పెడతారు?.. జాబిల్లిపై హక్కులు ఏ దేశానివి?

Last Updated : Sep 14, 2023, 11:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.