హజ్ యాత్రకు వెళ్లేందుకు అనుమతి కోసం భారతీయులు చేసుకున్న దరఖాస్తులను రద్దు చేస్తున్నట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసింది. హజ్‌యాత్రకు విదేశీయులను అనుమతించమని సౌదీ చేసిన ప్రకటనను పరిగణించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ ఏడాది హజ్ యాత్రకు స్థానికులను మాత్రమే అనుమతిస్తున్నట్లు ఇటీవల సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదీ చదవండి : డేల్టా వేరియంట్‌పైనా ఈ టీకా పనితీరు భేష్!