ETV Bharat / bharat

'యూపీలో భాజపాకు మూడు లేదా నాలుగు సీట్లే!' - అఖిలేశ్​ యాదవ్

Akhilesh Yadav on BJP: యూపీ ఎన్నికల్లో భాజపాకు మూడు లేదా నాలుగు స్థానాలే దక్కుతాయని ఎద్దేవా చేశారు సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్. మౌర్య సహా భాజపాకు చెందిన కీలక నేతలు తమ పార్టీలోకి రావడం వల్ల వచ్చే 20 శాతం ఓట్లను కూడా ఆ పార్టీ పోగొట్టుకుందని తెలిపారు.

akhilesh yadav
'యూపీలో భాజపాకు మూడు లేదా నాలుగు సీట్లే'
author img

By

Published : Jan 14, 2022, 3:54 PM IST

Akhilesh Yadav on BJP: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికలు సమీపిస్తున్న వేళ భాజపా క్రమంగా కూలిపోతోందని సమాజ్​వాదీ పార్టీ నేత అఖిలేశ్​ యాదవ్​ అన్నారు. భాజపాలో ఒక్కో వికెట్​ పడిపోతోందని.. అయినా ముఖ్యమంత్రికి క్రికెట్​ ఆడటం చేతకాదని ఎద్దేవా చేశారు. భాజపాకు రాజీనామా చేసిన నేతలను ఎస్​పీలో శుక్రవారం చేర్చుకున్న సందర్భంగా అఖిలేశ్​ లఖ్​నవూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో మూడో వంతు సీట్లు తమకే దక్కుతాయని భాజపా అంటోందని.. దాని అర్థం ఆ పార్టీకి కేవలం మూడు లేదా నాలుగు రావడం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్వామిప్రసాద్​ మౌర్య అన్నారు. నిజమే.. ఈ సారి మా పార్టీకి చాలా మంది నేతలు తీసుకొచ్చారు. ఈ ఎన్నికల్లో భాజపాకు 20 శాతం ఎస్​పీకి శాతం సీట్లు దక్కేవి. కానీ మౌర్య సహా మిగతా ఎమ్మెల్యేల రాకతో ఆ 20 శాతం కూడా భాజపా పోగొట్టుకుంది. బాబా ముఖ్యమంత్రి ఓ లెక్కల మాస్టారును సంప్రదించాలి."

-అఖిలేషన్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

భాజపాకు 80 శాతం, ఇతర పార్టీలకు 20 శాతం మద్దతు ఉంటుందని ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు అఖిలేశ్​.

d
ఎస్​పీలో చేరిన స్వామిప్రసాద్​ మౌర్య
d
అఖిలేశ్​ యాదవ్​ ఆధ్వర్యంలో ఎస్​పీలో చేరిన ధరమ్​ సింగ్​ సైనీ

ఓబీసీ నేత స్వామి ప్రాస్​ మౌర్య, ధరమ్​ సింగ్​ సైనీ సహా మరో ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలు, అప్నా దళ్​కు (సోనేలాల్​) ఎమ్మెల్యే అమర్​సింగ్​ చౌదరి కూడా ఎస్​పీ కండువా కప్పుకున్నారు.

ఎస్​పీలో చేరిన ఆ ఐదుగురు భాజపా ఎమ్మెల్యేలలో భగవతి సాగర్ (బిల్హౌర్​ నియోజకవర్గం)​, రోషన్​ లాల్​ వర్మ (తిల్హర్​ ), బ్రజేష్​ ప్రజాపతి (తిన్​ద్వారీ ), వినయ్​ శక్యా (బిధునా ), ముకేశ్​ వర్మ (శిఖోహాబాద్​) ఉన్నారు.

ఓబీసీ నేత స్వామి ప్రసాద్​ మౌర్య రాజీనామాతో భాజపాలో ఫిరాయింపులు మొదలయ్యాయి. ఇప్పటివరకు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేశారు.

ఇదీ చూడండి : Nun rape case: అత్యాచారం కేసులో క్యాథలిక్​ బిషప్​ను నిర్దోషిగా తేల్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.