తమిళనాడులోని నాగపట్టణం నియోజకవర్గంలో ఓ మహిళ దుస్తులు ఉతికారు అధికార అన్నాడీఎంకే అభ్యర్థి తంగకత్తిరవన్. నాగూర్లో శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన.. ఓ మహిళ బట్టలు ఉతకడం గమనించారు. అనంతరం ఆమెను పక్కకు తప్పుకోమని చెప్పి ఆయనే వాటిని ఉతికేశారు.
ఆ దృశ్యాలను తంగకత్తిరవన్ అనుచరులు సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా, అవి వైరల్గా మారాయి. అయితే తాము మరోసారి అధికారం చేపడితే వాషింగ్ మెషీన్లు ఇస్తామని ఏఐఏడీఎంకే హామీ ఇవ్వడం గమనార్హం.
ఇదీ చూడండి: కమల్ నోట హంగ్ మాట- ప్రజలకు కీలక సూచన