ETV Bharat / bharat

'యోగి నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికలకు భాజపా' - యూపీ భాజపా

ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోనే రానున్న అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భాజపా నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై పార్టీ ప్రధాన కార్యదర్శి బి. ఎల్. సంతోష్.. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చ జరిపినట్లు తెలిపారు.

UP CM
యూపీ సీఎం, యోగి ఆదిత్యనాథ్
author img

By

Published : Jun 4, 2021, 1:47 PM IST

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ నేతృత్వంలోనే 2022 ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాలని భాజపా నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి బీ.ఎల్​. సంతోష్ తెలిపారు. ఎన్నికల ముందు మార్పులు చేయకూడదని అన్నారు. ఈ విషయంపై గురువారం జేపీ నడ్డాతో చర్చ జరిపినట్లు పేర్కొన్నారు. సంఘ్​ నేతలు కూడా యూపీలో క్షేత్రస్థాయి పరిస్థితుల వివరాలు సేకరించారని స్పష్టం చేశారు.

2022లో ఎన్నికలు జరగనున్న వేళ.. ఆ రాష్ట్ర భాజపా నేతల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. స్థానిక ఎన్నికల్లో భాజపాకు ఆశించిన ఫలితాలు రాని నేపథ్యంలో ఈ సమస్య తలెత్తినట్లు సంతోష్ అన్నారు. ఈ విషయంపైనా పార్టీ నేతలతో, జేపీ నడ్డాతో చర్చించినట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి:యూపీ భాజపాలో లుకలుకలు- యోగికి పార్టీ మద్దతు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.