ETV Bharat / bharat

'సాగు చట్టాల వల్ల తీవ్ర స్థాయికి ద్రవ్యోల్బణం' - రైతు వ్యతిరేక చట్టాలు

రైతులు, సామాన్య ప్రజలకు కొత్త సాగు చట్టాలు వ్యతిరేకమని, అవి కొంత మంది పెట్టుబడిదారులకే మేలు చేకూర్చేలా ఉన్నాయని ఆరోపించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. దేశంలో ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకునేందుకు ఈ చట్టాలు దారితీస్తాయన్నారు. రైతుల ఆందోళనపై రాజకీయాలు చేయటం మానుకోవాలని హితవు పలికారు.

Aravind kejriwal
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​
author img

By

Published : Dec 14, 2020, 7:42 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలపై మరోమారు విమర్శలు గుప్పించారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయికి చేరుకునేందుకు కొత్త చట్టాలు కారణమవుతాయని ఆరోపించారు. వ్యవసాయ చట్టాలు.. రైతులు, సామాన్యులకు వ్యతిరేకమని, కొంత మంది పెట్టుబడి దారులకే మేలు చేసేలా ఉన్నాయని పేర్కొన్నారు.

రైతులకు మద్దతుగా ఆప్​ నాయకులు, ఎమ్మెల్యేలు, వలంటీర్లు పార్టీ కార్యాలయంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలో పాల్గొన్న సందర్భంగా ఈ మేరకు వ్యాఖ్యానించారు కేజ్రీవాల్​.

" ప్రజలకు కావాల్సినంత నిల్వ చేసుకోవచ్చని ఈ చట్టం చెబుతోంది. రైతుల సమస్యపై రాజకీయాలు చేయటం ఆపాలని అన్ని పార్టీలను కోరుతున్నా. ఈ చట్టాలు రైతులు, సామాన్య ప్రజలకు వ్యతిరేకం. కేవలం కొంత మంది పెట్టుబడి దారులకు లబ్ధి చేకూరేలా ఉన్నాయి. అధికంగా నిల్వచేయటం ద్వారా ద్రవ్యోల్బణం తీవ్రస్థాయికి చేరుకుంటుంది. ధరలు పెంచేందుకు ఈ చట్టాలు లైసెన్సులు ఇస్తాయి. ఈ చట్టాల వల్ల కొనాళ్లలోనే గోధుమలు నాలుగు రేట్ల ఖరీదవుతాయి. రైతులకు మద్దతుగా నిలిచి సాయం చేస్తున్నట్లు ఆనుకోవద్దు. రైతులే ఆందోళనలు చేసి సాయం చేస్తున్నారు. "

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి.

ఆమ్​ ఆద్మీ పార్టీ రైతులకు మద్దతుగా నిలుస్తుందన్నారు కేజ్రీవాల్​. దేశవ్యాప్తంగా ఆప్​ వలంటీర్లు రైతులతో పాటు నిరాహార దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారని చెప్పారు. రైతులకు మద్దతుగా నిలవటం వల్ల తనపై కేంద్రం ఆగ్రహంగా ఉందన్నారు. మైదానాలు తాత్కాలిక జైళ్లుగా మార్చేందుకు ఇవ్వాలని కోరగా.. తాము నిరాకరించామని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'నిరాహార దీక్ష'తో కేంద్రానికి రైతుల హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.