మధ్యప్రదేశ్లో అమానవీయ ఘటన జరిగింది. తనకు కుమార్తె పుడుతుందనుకోగా.. కుమారుడు పుట్టాడని ఓ మహిళ నెలరోజులు పసికందును బావిలో పడేసింది. ఫలితంగా ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన బడ్వానీ జిల్లా సంగ్వీ గ్రామంలో జరిగింది.
ఇంతకీ ఏం జరిగిందంటే..
సంగ్వీ గ్రామానికి చెందిన లలిత మహిళకు ఇది వరకే ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు. నాలుగో కాన్పులో ఆమె తనకు అమ్మాయి పుడుతుందని భావించింది. కానీ, అలా జరగలేదు. దాంతో తన నెలరోజుల బాబును ఈ నెల 16న, ఉదయం నాలుగింటికి తమ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బావిలో పడేసిందని పోలీస్ అధికారిణి సోను షితోలే తెలిపారు. అనంతరం.. పోలీసులను ఆమె తప్పు దోవ పట్టించిందని చెప్పారు.
అయితే.. దర్యాప్తులో లలితే ఈ నేరం చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆమెను అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపర్చారు.
ఇదీ చూడండి: కరోనాతో గర్భిణీ వైద్యురాలు మృతి