A Young Man Chained For 20 Years In West Bengal : మానసిక అనారోగ్యం కారణంగా గత 20 ఏళ్లుగా సంకెళ్లతో జీవిస్తున్నాడు బంగాల్‌కు చెందిన ఓ యువకుడు. అతడికి వైద్యం చేయించే స్తోమత లేక.. అలానే వదిలేస్తే ఎక్కడ పారిపోతాడననే భయంతో తల్లిదండ్రులు గత రెండు దశాబ్దాలుగా ఆ యువకుడిని చెట్టుకు బంధించి ఉంచారు. ఎట్టకేలకు మాల్జా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా.. యువకుడికి వైద్య సాయం చేస్తామని హామీ ఇవ్వడం వల్ల యువకుడి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
మాల్దా జిల్లాలోని బరుయిపర గ్రామానికి చెందిన శివశంకర్ రామ్, సుమేధా దేవి దంపతుల ఐదో కుమారుడు వరుణ్ రామ్(28). ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు ఓ రోజు మధ్యాహ్నం భోజనం చేసి తన తండ్రి దగ్గర పడుకున్నాడు వరుణ్. ఆకస్మాత్తుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి తన కొడుకు ఇలానే మానసికంగా బాధపడుతున్నాడని వరుణ్ తల్లి చెబుతోంది.
"చిన్నప్పుడు వరుణ్ బాగానే ఉండేవాడు. ఎనిమిదేళ్ల వయసు నుంచి అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. అప్పటి నుంచి వరుణ్ ఎందుకు అలా చేస్తున్నాడో అర్థం కాలేదు. వదిలేస్తే పారిపోయేవాడు. ఇంటి నుంచి తప్పించుకొని ఎక్కడ సరిహద్దు దాటి వెళ్తాడని భయంతో చెట్టుకు బంధించి ఉంచుతున్నాం. గతంలో ఒకసారి ఇలానే తప్పిపోయాడు. అప్పడు వరుణ్ని తిరిగి తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. నేను, నా భర్త కూలీ పనులు చేసుకునే వాళ్లం. మా దగ్గర వరుణ్‌కి వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేక ఇలా గత 20 ఏళ్లుగా బంధించి ఉంచాం. మేము పనికి వెళ్తే నా కుమార్తె వరుణ్‌ను చూసుకుంటుంది."
-సుమేధా దేవి, వరుణ్ తల్లి
వరుణ్‌కి వైద్యం చేయించడానికి ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశామని అతడి తండ్రి శివశంకర్ రామ్ తెలిపాడు. కానీ ప్రభుత్వం స్పందించలేదని చెప్పాడు. ఆ తర్వాత వరుణ్‌కి వైద్య సాయం కోసం స్థానిక పంచాయితీ, ప్రభుత్వ అధికారులను ఆశ్రయించారు. మనోజ్ మందల్ అనే పంచాయతీ సభ్యుడు.. వరుణ్‌కి వైద్య సాయం చేయాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మాల్దా జిల్లా మేజిస్ట్రేట్ నితిన్ సింఘానియా.. వరుణ్ మానసిక స్థితి గురించి తెలుసుకుని నివేదికను ఇవ్వమని అధికారులను ఆదేశించారు. నివేదిక తర్వాత వరుణ్‌కు వైద్యం చేయించేందుకు అవరసరమైన అన్ని రకాల ఏర్పాట్లు చేశామని మాల్దా జిల్లా కలెక్టర్ నితిన్ సింఘానియా తెలిపారు.
"నేను కూలీ పని చేస్తాను. ఒక రోజు పని ఉంటే.. మిగతా నాలుగు రోజులు పని ఉండదు. తిన్నా, తినకపోయినా రెండేళ్లు నా కుమారుడికి వైద్యం చేయించాను. ఇంకా చిక్సితకు అయ్యే ఖర్చు భరించలేకపోయాను. అప్పటినుంచి వరుణ్‌కి వైద్యం చేయించలేదు." అని శివశంకర్ అన్నారు.
కూతుర్ని గొలుసుతో బంధించిన తండ్రి.. 36 ఏళ్లుగా కిటికీలోంచే భోజనం, స్నానం.. చివరకు..