లవ్ ట్రయాంగిల్లో చిక్కుకున్న ఇద్దరు మిత్రులు తాము ప్రేమించిన అమ్మాయి కోసం ఘర్షణకు దిగారు. ఇంతలో ఆగ్రహం చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడినే హతమార్చాడు. ఆ తర్వాత ఏమి ఎరుగనట్టు ఆ మృతదేహాన్ని సూట్‌కేస్‌లో పెట్టి దాన్ని రైల్వే స్టేషన్లో వదిలి వెళ్లాడు. ఆ సూట్‌కేసును గుర్తించిన ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో మృతదేహం ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు.. నిందితుడిని ఇట్టే పట్టేసి అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల కథనం ప్రకారం... బిహార్‌కు చెందిన ముహమ్మద్ షామిమ్తో అనే వ్యక్తి గాడీపుర్లోని ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. అతనితో పాటు మొహమ్మద్ అష్ఫాక్ అనే వ్యక్తి కూడా అదే ఫ్యాక్టరీలో పని చేస్తున్నాడు. ఇద్దరూ అక్కడే ఉన్న ఓ క్వార్టర్స్‌లో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో ఉంటున్న ఓ మహిళను షామీమ్ ప్రేమించగా.. అఫ్షాక్ సైతం ఆమెను ప్రేమించాడు.
మహిళను ప్రేమిస్తున్న విషయాన్ని షామిమ్ తన స్నేహితుడు అష్ఫాక్‌తో చెప్పాడు. అయినప్పటికీ.. అష్ఫాక్.. ఆ మహిళపై మనసుపారేసుకున్నాడు. ఈ విషయమై తరచూ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగేది. ఈ క్రమంలో బుధవారం ఆ ఇద్దరి మధ్య ఘర్షణ జరగగా.. షామిను అష్ఫాక్ హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకూదడని ఆ మృతదేహాన్ని ఓ సూట్‌కేస్‌లో పెట్టి జలంధర్ రైల్వేస్టేషన్లో వదిలి వెళ్లాడు. ఎట్టకేలకు పోలీసులు ఈ కేసును చేధించి నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.