రైతు ఆందోళనలతో రాజస్థాన్-హరియాణా సరిహద్దు షాజహాన్‌పూర్‌లో ఉద్రిక్తత నెలకొంది.
దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతు తెలిపేందుకు వెళ్తున్న రాజస్థాన్ రైతులను హరియాణా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో ఘర్షణకు దిగిన రైతులు, టోల్‌ప్లాజాపై దాడికి యత్నించారు. కొంతమంది రైతులు.. సరిహద్దులు దాటి హరియాణాలోకి ప్రవేశించారు.