ETV Bharat / bharat

రోడ్డు పక్కన గుంతలో ఆడ శిశువు - యూపీ నేర వార్తలు

జాతీయ బాలికా దినోత్సవం రోజు యూపీలో అమానవీయ ఘటన వెలుగు చూసింది. ఓ ఆడ శిశువును రోడ్డు పక్కనే ఉన్న ఓ గుంతలో విసిరేసి వెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఆ పసికందు ఏడుపు విని.. స్థానిక ఆస్పత్రికి తరలించారు స్థానికులు.

A girl child was rescued from sewer hole by villagers in UP
అమానవీయం- రోడ్డుపక్కన గుంతలో ఆడ శిశువు
author img

By

Published : Jan 24, 2021, 3:11 PM IST

అమానవీయం- రోడ్డుపక్కన గుంతలో ఆడ శిశువు

దేశమంతా జాతీయ బాలికా దినోత్సవం జరుపుకుంటున్న వేళ ఉత్తర్​ప్రదేశ్​లో అమానవీయ ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన ఓ చిన్నారిని.. రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడేసి వెళ్లారు.

రామ్​పుర్​లో జరిగిన ఈ ఘటనలో.. చిన్నారి ఏడుపు విని స్థానికులు ఆ శిశువును గుర్తించారు. తక్షణమే ఆ పసికందును స్థానిక జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. బాలికను పైనుంచి కిందకు విసిరేసినట్టు గుర్తించిన వైద్యులు.. అత్యంత విషమ పరిస్థితుల్లో ఉన్నట్లు తెలిపారు. తలకు తీవ్ర గాయాలవడం సహా.. ఎముకలు కూడా విరిగాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అవసరమైతే ఆ శిశువును మెరుగైన చికిత్స కోసం మరో ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: బాలికల సాధికారత కోసం మేం ఎంతో చేశాం: మోదీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.