ETV Bharat / bharat

దెయ్యం పట్టిందని కన్నకూతురి హత్య!.. ఆవునూ వదిలిపెట్టని కామాంధుడు!! - unnatural act with cow

అనారోగ్యంతో బాధపడుతోన్న ఓ ఆరేళ్ల బాలికకు దెయ్యం పట్టిందనే అనుమానంతో ఆమె తల్లిదండ్రులు దారుణంగా కర్రతో కొట్టారు. దీంతో అక్కడిక్కడే చిన్నారి మరణించింది. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో జరిగింది. మరోవైపు, కాలేజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఓ సోషల్​ మీడియా ఆర్టిస్ట్​ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.

a-father-kills-his-own-daughter-on-suspicion-of-demon-possession

author img

By

Published : Aug 7, 2022, 3:47 PM IST

మహారాష్ట్రలోని నాగ్​పుర్​లో దారుణం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలికకు దెయ్యం పట్టిందని కర్రతో కొట్టి చంపారు ఆమె తల్లిదండ్రులు.
పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని సుభాష్​ నగర్​ ప్రాంతంలో సిద్ధార్థ్​ చిమనే అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. అయితే సిద్ధార్థ్​ ఆరేళ్ల కుమార్తె కొద్దిరోజుల క్రితం అనారోగ్యం బారినపడింది. ఎన్ని మందులు వేసినా కోలుకోవట్లేదు. అయితే ఆమె తల్లిదండ్రులు.. చిన్నారికి దెయ్యం పట్టిందని భావించారు. స్థానికంగా ఉన్న ఓ బాబా దగ్గరికి తీసుకెళ్లి ఏవో పూజలు చేశారు. అనంతరం ఇంటికి వచ్చాక కూడా రకరకాల పూజలు నిర్వహించారు. అయినా ఎటువంటి లాభం లేకపోవడం వల్ల సిద్ధార్థ్​ దంపతులతోపాటు మరో మహిళ కలిసి.. భూతవైద్యం పేరుతో చిన్నారిని కర్రతో గట్టిగా కొట్టారు. దీంతో బాలిక అక్కడిక్కడే కుప్పకూలింది.

వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె అప్పటికే మరణించిందని వైద్యులు తెలిపారు. వెంటనే బాలిక తల్లిదండ్రులు.. మృతదేహాన్ని ఆసుపత్రిలో వదిలేసి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలిక మృతికి కారణమైన ముగ్గురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

విద్యార్థిని రేప్​ కేసులో సోషల్​ మీడియా ఆర్టిస్ట్​ అరెస్ట్​
కేరళ.. తిరువనంతపురంలోని ఓ లాడ్జిలో నెలరోజుల క్రితం కాలేజీ విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసులో ప్రముఖ సోషల్ మీడియా ఆర్టిస్ట్‌ను అరెస్టు చేశారు పోలీసులు. అదే రోజు కోర్టులో హజరుపరచి.. 14 రోజులు జ్యుడీషియల్​ కస్టడీకి తరలించామని చెప్పారు.

నెలరోజులు క్రితం.. నిందితుడు సోషల్​​ నెట్​వర్కింగ్​ సైట్​లో పరిచయమైన బాధితురాల్ని కారు కొనేందుకు బయటకు రమ్మన్నాడు. అనంతరం ఫ్రెష్​ అవుదామని, స్థానికంగా ఉన్న లాడ్జికి తీసుకెళ్లాడు. అక్కడికి వెళ్లాక అత్యాచారానికి పాల్పడ్డాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడ్ని అరెస్ట్​ చేశారు. అతడి దగ్గర ఉన్న మొబైల్​ ఫోన్​ను స్వాధీనం చేసుకున్నారు. పలు కోణాల్లో దర్యాప్తు చేపడుతున్న పోలీసులు.. నిందితుడిపై మరో రెండు కేసులు ఉన్నాయని చెప్పారు.

ఆవుతో అసహజ చర్యకు పాల్పడిన వ్యక్తిపై కేసు
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నగరంలో ఆవుతో అసహజ చర్యకు పాల్పడిన ఓ గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. దీనదయాళ్ నగర్‌లో ఆగస్టు 4న జరిగిన ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీటీవీలో రికార్డు​ అయిందని చెప్పారు. రాష్ట్రీయ గోరక్ష వాహిని డివిజన్ అధ్యక్షుడు నిర్పత్ సింగ్ తోమర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపడతున్నట్లు చెప్పారు.

ఇవీ చదవండి: ఏడేళ్ల వయసులో బాలిక మాయం.. 9 సంవత్సరాల తర్వాత కిడ్నాపర్ దొరికాడిలా...

కరెంట్ స్తంభానికి కట్టి కర్రలతో దాడి.. గిలగిలా కొట్టుకుంటూ వృద్ధుడు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.