Thiruvalluvar Image In Paddy: పచ్చగా ఉన్న వరిపొలాల మధ్య ఈ పొలం మాత్రం ఎండిపోయినట్లు కనిపిస్తుంది కదూ. మడి మధ్యలో కొంతభాగం మాత్రమే ఎండిపోయినట్లు ఉన్న ఈ పొలం ఓ కవిపై రైతుకు ఉన్న అభిమానానికి నిదర్శనం. ఎండిపోయిన ఈ పొలంలోనే తమిళనాడుకు చెందిన ప్రముఖకవి, తత్వవేత్త తిరుక్కరల్ గ్రంథ రచయిత తిరువళ్లువర్ చిత్రం దాగుంది.
తమిళనాడులోని మళ్లయపనూర్ గ్రామానికి చెందిన ఇళంగోవన్‌కు చిన్నప్పటి నుంచి ప్రముఖ కవి తిరువళ్లువర్ అంటే అంతులేని అభిమానం. ఆ అభిమానంతోనే తన వరి పొలంలో తిరువళ్లువర్ చిత్రాన్ని రూపొందించాడు. తమిళనాడు సంస్కృతిని దశదిశలా వ్యాప్తి చేసిన తిరువళ్లువర్ ఖ్యాతిని చాటేందుకు తన అభిమానాన్ని విభిన్నంగా చాటి చెప్పానని ఇళంగోవన్ తెలిపారు. వరిపొలంతో అద్భుతంగా రూపొందించిన చిత్రపటాన్ని చూసేందుకు ఇరుగుపొరుగు గ్రామాల ప్రజలు తరలివస్తున్నారు. తిరువళ్లువర్ చిత్రం అద్భుతంగా ఉందంటూ ఆ రైతుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇవీ చూడండి: అవిభక్త కవలలకు.. అరుదైన శస్త్రచికిత్స సక్సెస్!