ETV Bharat / bharat

సోనూసూద్​ క్రేజ్​ మామూలుగా లేదుగా!

author img

By

Published : Jul 4, 2021, 4:00 PM IST

నిజ జీవితంలో అతని అభిమాన హీరోపై ఉన్న ప్రేమను తనదైన రీతిలో చాటుకోవాలని అనుకున్నారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి. ప్రత్యేకంగా ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించారు. తన సోదరి, మిత్రునితో కలిసి చర్చించారు. చివరకు తనకున్న కార్​పై సోనూకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, ఆయన వ్యాఖ్యలను ముద్రించారు.

car with Sonu Sood's social work
కారుపై సోనూఫోటోలు
సోనూసూద్​పై వినూత్నంగా అభిమానం చాటుకున్న ఫ్యాన్

కరోనా లాక్​డౌన్​ ముందు వరకు కేవలం నటుడుగా ఉన్న సోనూసూద్ ఆ తరువాత రియల్​ హీరోగా మారారు. కొవిడ్​ కష్టకాలంలో ప్రజలకు చేసిన సేవలతో ఆయన ఎంతో మందికి మార్గదర్శిగా నిలిచారు. ఈ క్రమంలో చాలామంది అభిమానులను సంపాదించుకున్నారు. వారిలో ఒకరైన శ్రీ ప్రసాద్​ ఆచార్య అనే వ్యక్తి సోనూపై అభిమానంతో తన కారు బయట భాగం మొత్తాన్ని ఆయన ఫొటోలతో నింపారు. సోనూ సేవలకు కృతజ్ఞతగా తాను ఇలా చేసినట్లు చెప్పారు కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాలాకు చెందిన ప్రసాద్​.

"సోనూసూద్​కు నా సోదరి ఉషా జగదీశ్​ ఆచార్య, నేను ఇద్దరం అభిమానులం. ఆయన లాక్​డౌన్​ సమయంలో దేశవ్యాప్తంగా ఎంతోమంది ప్రజలుకు సేవ చేశారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారిని కూడా వారి స్వస్థలాలకు చేర్చారు. ఇప్పటికీ ఆక్సిజన్​, బెడ్స్​, రేషన్​ కిట్స్​ ఇవ్వడమే కాక ఇంకా అనేక విధాలుగా సేవ చేస్తున్నారు. ఇందుకుగాను ఆయనకు మేము కృతజ్ఞతలు చెప్పాలి అనుకున్నాం. అది కూడా భిన్నంగా. అందుకే నా కారుకు బయట మొత్తం సోనూసూద్​ వార్తలు, ఆయన ఫొటోలతో నింపాను."

-శ్రీ ప్రసాద్​ ఆచార్య, సోనూ అభిమాని

స్పందించిన సోనూసూద్​...

car with Sonu Sood's social work
సోషల్​ మీడియాలో షేర్​ చేసిన సోనూ సూద్​

తనపై శ్రీపాద ఆచార్యకు ఉన్న అభిమానానికి ఫిదా అయ్యారు సోనూసూద్​. సోషల్​ మీడియా వేదికగా ప్రసాద్​ కారు ఫొటోలు షేర్​ చేశారు.

car with Sonu Sood's social work
కారు పై సోనూ ఫోటోలు, వార్తలు

ఇదీ చూడండి: Viral: సర్పంతో సరదాగా సైకిల్ సవారీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.