ETV Bharat / bharat

రెండురోజుల క్రితం గృహప్రవేశం.. దంపతులు సజీవ దహనం.. పాపం కుమార్తె... - ఇడుక్కి వార్తలు

Kerala Couple: సొంతిల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన రెండో రోజులకే చనిపోయారు కేరళ చెందిన దంపతులు. ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి ప్రాణాలు కోల్పోయారు. ఇదే రాష్ట్రంలో జరిగిన మరో ఘటనలో ప్రెషర్ కుక్కర్​ పేలి ఓ వ్యక్తి మరణించాడు.

A couple dies after a fire broke out in their newly built house
సొంతింటి కల సాకారమైన రెండు రోజులకే దంపతులు మృతి
author img

By

Published : Apr 25, 2022, 1:26 PM IST

Updated : Apr 25, 2022, 2:02 PM IST

Kerala Couple Death News: సొంతిల్లు కట్టుకోవాలనే కలను సాకారం చేసుకుంది ఆ జంట. కొత్తగా ఇంటిని నిర్మించుకుంది. ఘనంగా గృహప్రవేశం చేసింది. కానీ ఆ తర్వాత రెండు రోజులకే.. ఇంట్లో అగ్నిప్రమాదం సంభవించి దంపతులిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన వారి కుమార్తె ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. కేరళ ఇడుక్కి జిల్లాలోని పుత్తడి గ్రామంలో సోమవారం ఉదయం 2 గంటల సమయంలో జరిగింది ఈ హృదయవిదారక ఘటన.

A couple dies after a fire broke out in their newly built house
సొంతింటి కల సాకారమైన రెండు రోజులకే దంపతులు మృతి

చనిపోయిన దంపతులిద్దరినీ రవీంద్రన్​(50), ఉష(45)గా గుర్తించారు పోలీసులు. వీరిది పేద కుటుంబం. ఆర్థికంగా వెనుకపడిన వారికి లైఫ్ ప్రాజెక్టు పేరుతో సొంతిల్లు కట్టుకునేందుకు సాయం చేస్తోంది కేరళ ప్రభుత్వం. ఇందులో భాగంగానే వారి కొత్త ఇంటి నిర్మాణం పూర్తయింది. అందులోకి వెళ్లిన రెండు రోజులకే ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదం జరిగిన తర్వాత రవీంద్రన్​, ఉషల కూతురు శ్రీ ధన్య ఇంటిపైనుంచి బయటకు దూకింది. భయంతో ఏడుస్తూ గట్టిగా అరవడం చూసి చుట్టుపక్కల వచ్చాక ప్రమాదం విషయం తెలిసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. అనంతరం శ్రీ ధన్య, ఆమె తల్లిదండ్రులకు ఆస్పత్రికి తరలించారు. అయితే దంపతులిద్దరూ అప్పటికే చనిపోయిటన్లు వైద్యులు ప్రకటించారు. కాలిన గాయాలైన కూతురికి మెరుగైన చికిత్స కోసం ఇడుక్కి ఆస్పత్రి నుంచి కోట్టాయం మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

కుక్కర్ పేలి వ్యక్తి మృతి: ఇడుక్కి జిల్లాలోనే కట్టాప్పనాలో మరో ప్రమాదం జరిగింది. ఇంట్లో వంట చేస్తుండగా.. ప్రెషర్ కుక్కర్ పేలి ఉరియకున్నాథ్​ శిభు అనే వ్యక్తి మృతి చెందాడు. పూవర్స్​మౌంట్ గ్రామంలో ఆదివారం ఉదయం 7 గంటలకు ఈ ఘటన జరిగింది. ఉరియకున్నాథ్ భార్య గర్భవతి కావడం వల్ల కొద్ది రోజులుగా ఇంట్లో వంట అతనే చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం అల్పాహారం చేసే సమయంలో ప్రమాదవశాత్తు ప్రెషర్​కుక్కర్​ పేలింది. దాని విజిల్​ అతని తలకు బలంగా తాకింది. ఇంట్లోనే ఉన్న అతని భార్య, మామ హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లారు. తలకు తీవ్ర గాయం కావడం వల్ల రక్తం గడ్డకట్టింది. వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేస్తుండగా.. మరణించాడు. ఉరియకున్నాథ్​కు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఇదీ చదవండి: కొత్తగా పెళ్లైన దళిత జంటను గుడిలోకి రానివ్వని పూజారి

Last Updated : Apr 25, 2022, 2:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.