ETV Bharat / bharat

చికిత్స పేరుతో దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం - ముంబయిలో దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం

చికిత్స కోసం తన వద్దకు వచ్చిన దివ్యాంగురాలైన యువతిని అత్యాచారం చేశాడు ఓ కీచక డాక్టర్​. వైద్యం పేరుతో తన కామదాహాన్ని తీర్చుకున్నాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని శాంటాక్రూజ్ ప్రాంతంలో జరిగింది.

rape on crippled girl
దివ్యాంగురాలిపై డాక్టర్​ అత్యాచారం
author img

By

Published : Oct 25, 2021, 1:13 PM IST

దివ్యాంగురాలైన 16 ఏళ్ల యువతిపై ఓ డాక్టర్​ అత్యాచారం చేశాడు. ఫిజియోథెరపీ చికిత్స పేరుతో ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన మహారాష్ట్ర ముంబయిలోని శాంటాక్రూజ్​ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు నిందితుడు హరీశ్​​పై కేసు నమోదు చేశారు.

ఇదీ జరిగింది...

దివ్యాంగురాలైన ఓ యువతి చికిత్స కోసమని ముంబయిలోని శాంటాక్రూజ్​ ప్రాంతంలో ఉండే హరీశ్​ అనే వైద్యుడి​ దగ్గరకు 2016 నుంచి వస్తుండేది. అయితే ఫిజియోథెరపీ పేరుతో అక్టోబర్​ 2019 నుంచి మార్చి 2021 వరకు పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే ఇది చికిత్సలో భాగంగా భావించిన యువతి పట్టించుకోలేదు. అయితే ఈ విషయాన్ని కొద్ది రోజుల క్రితం బాధితురాలు.. తల్లికి మెసేజ్​ల రూపంలో వివరించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై శాంటాక్రూజ్​ పోలీస్​స్టేషన్​లో అధికారులు కేసు నమోదు చేసి.. నిందితుని కోసం గాలిస్తున్నారు.

ఇదీ చూడండి: భారీగా హిమపాతం.. ముగ్గురు పర్వతారోహకులు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.