ETV Bharat / bharat

ఆ ఆసుపత్రిలో ఐదు రోజుల్లో 89 మరణాలు.. ఏం జరుగుతోంది? - సిలుగూర్​లో వైద్యులు లేక చనిపోయన రోగులు

బంగాల్​లోని ఓ ఆసుపత్రిలో వెలుగు చూస్తున్న మరణాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఐదు రోజుల్లో 89 మంది మృత్యువాత పడ్డారు. ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లు పండగ సందర్భంగా విధులకు హాజరుకాకపోవడమే ఇందుకు కారణమని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.

89 patients reportedly died in NBMCH
ఐదు రోజుల్లో 89 మరణాలు
author img

By

Published : Oct 17, 2021, 10:54 AM IST

బంగాల్​లోని 'ది నార్త్​ బంగాల్​ మెడికల్​ కాలేజ్'​ ఆసుపత్రిలో అసాధారణ రీతిలో మరణాలు నమోదవుతున్నాయి. కేవలం 5 రోజుల్లో 89 మంది చనిపోయారు. అంతేగాక అక్టోబర్​ 9 నుంచి 15వ తేదీ వరకు 118 మంది మరణించినట్లు లెక్కలు చెప్తున్నాయి. కానీ ఆసుపత్రి యాజమాన్యం వీటిని సాధారణ మరణాల కిందే లెక్కగడుతోంది. మృతుల బంధువుల వాదన మాత్రం మరోలా ఉంది.

దుర్గాపూజ సందర్భంగా ఆసుపత్రికి డాక్టర్లు రాలేదని.. దీంతో రోగులు ఇబ్బందిపడి చనిపోయినట్లు మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో ఫిజీషియన్​ లేకపోవడం వల్ల చాలామంది మరణించినట్లు చెప్పారు. ప్రతి ఏడాది డాక్టర్లు అందరూ మూకుమ్మడిగా సెలవులు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఈ సెలవులు రోస్టర్​ పట్టికలో ఉండవని పేర్కొన్నారు.

జూనియర్​ డాక్టర్​లతో తూతూ మంత్రంగా..

రోస్టర్​ ప్రకారం సీనియర్​, జూనియర్​ డాక్టర్లకు డ్యూటీల వేస్తారు. కానీ పండగ రోజుల్లో సీనియర్​ డాక్టర్లు ఎక్కడా కనిపించలేదని మృతుల బంధువులు ఆరోపించారు. కేవలం జూనియర్​ డాక్టర్లు, ఇంటర్న్​షిప్​ ట్రైనీలతో రోగులను ఈ పండగ రోజుల్లో నడిపించినట్లు చెప్పుకొచ్చారు. దీంతో ఆసుపత్రిలో మరణాల సంఖ్య పెరిగిందని చెప్పారు.

"దుర్గాపూజ నాడు నా సోదరుడు ఆసుపత్రిలో చేరాడు. అతనికి శ్వాసకోశ సమస్యలు ఉన్నాయి. కానీ ఈ పండగ రోజుల్లో ఒక్క డాక్టర్​ కూడా వచ్చి చూడలేదు. చివరికి అతను శనివారం చనిపోయాడు. కనీసం ఆసుపత్రిలో ఉన్న డాక్టర్లతో మాట్లాడేందుకు కూడా మాకు అనుమతి లేకుండా పోయింది."

-నజుమా బేగం, మృతుని సోదరి

తన భర్త ఆసుపత్రిలో చేరి వారం రోజులు గడిచినా.. డాక్టర్లు ఎవరూ చూసేందుకు రాలేదని ఓ రోగి భార్య రేఖా దాస్ ఆరోపించారు. ఇంత వరకు ఆయనకు సరైన చికిత్స అందించలేదని చెప్పారు.

ఈ ఆరోపణలను అధికారులు ఖండించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజయ్ ముల్లిక్ దీనిపై స్పందించారు. మరణాల సంఖ్య అసాధారణంగా ఏమీ లేదని అన్నారు. పండగ రోజుల్లో ఆసుపత్రిలో వైద్యులు లేరనే ఆరోపణలు కూడా నిరాధారమైనవని పేర్కొన్నారు. రోస్టర్​ ప్రకారమే వైద్యులు విధులకు హాజరయ్యారని చెప్పారు.

ఇదీ చూడండి: సింఘు 'హత్య' కేసులో నలుగురి అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.