ఝార్ఖండ్ హజారిబాగ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తోన్న ఓ బస్సు.. రోడ్డుపక్కన ఆగి ఉన్న ట్రక్కును వెనకునుంచి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 75 మంది గాయపడ్డారు. వారిలో తొమ్మది మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులంతా బంగాల్‌కు చెందినవారిగా గుర్తించారు.
ఇదీ జరిగింది
బంగాల్ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బసిర్హట్ ప్రాంతానికి చెందిన 75 మంది ఓ బస్సులో తీర్థయాత్రకు వెళ్లారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌ను సందర్శించుకుని.. బిహార్‌లోని బోధ్‌గయాకు వెళ్తుండగా.. ఝార్ఖండ్, చౌపరన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 2వ నంబరు జాతీయ రహదారిపై దనువా-భనువా ఘాట్ వద్ద సోమవారం రాత్రి ప్రమాదం జరిగింది. బస్సులోని యాత్రికులకు తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా.. పలువురికి ప్రథమ చికిత్స చేసి డిశ్చార్జ్ చేశారు వైద్యులు. తీవ్రంగా గాయపడిన తొమ్మిది మందిని హజారిబాగ్ వైద్య కళాశాలకు తరలించాలని సూచించారు. అయితే అందుకు నిరాకరించిన బాధితుల బంధువులు.. వారిని బంగాల్‌కు తీసుకెళ్లారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. బస్సును సీజ్ చేశారు.
ఇదీ చూడండి: సింఘు సరిహద్దులో రైతు ఆత్మహత్య