దేశంలోని వివిధ చోట్ల దాడులు చేసేందుకు సిద్ధంగా ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై అఫ్గాన్ సైన్యం విరుచుకుపడింది. ఈ దాడుల్లో శనివారం ఒక్కరోజే 74 మంది చనిపోయారని, మరో 15 తీవ్రంగా గాయపడ్డారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పక్కా సమాచారంతో కాందహార్ రాష్ట్రంలోని జెరియా, దాండ్, పంజావి, అర్గందాబ్లో పెద్ద ఎత్తున సైనిక కార్యకలాపాలను చేపట్టినట్టు తెలిపింది. ముష్కర స్థావరాల నుంచి పెద్దఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించింది.