అరుణాచల్ ప్రదేశ్ తూర్పు సియాంగ్ జిల్లా పాసిఘాట్ జైలులోని ఖైదీలు.. సినీ ఫక్కీలో పరారయ్యారు. ఆదివారం రాత్రి భోజనం సమయంలో గేట్లు తెరవగా.. ఏడుగురు ఖైదీలు పక్కనే ఉన్న పోలీసులపై కారం, మిరియాల పొడి చల్లి పరారయ్యారు. ఈ ఘటనలో అస్వస్థతకు గురైన పోలీసులను ఆస్పత్రికి తరలించామని ఐజీపీ చుకు అపా తెలిపారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ బృందంతో కలిసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
పాసిఘాట్లో కర్ఫ్యూ విధించిన కారణంగా ఖైదీలు ఎక్కువ దూరం ప్రయాణించలేరని, వారిని త్వరలోనే పట్టుకుంటామని ఎస్పీ తపంగ్ తతక్ తెలిపారు.
ఇదీ చదవండి: గర్భవతి కళ్లెదుటే దారుణ హత్య- సుప్రీం కీలక నిర్ణయం