ETV Bharat / bharat

ఆయనకు 62.. ఈమెకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు! - సత్నా జిల్లాలో ఒకే కాన్పులో ముగ్గురు

Old man becomes father : ఓ వృద్ధుడు తన 62 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లల తండ్రయ్యాడు. ఈ అరుదైన సంఘటన మధ్యప్రదేశ్​లో వెలుగు చూసింది.

62 year old man became father of 3 children with second marriage in satna madhya pradesh
ఆయనకు 62.. ఈమెకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు..!
author img

By

Published : Jun 14, 2023, 1:28 PM IST

Triplets In MP : మధ్యప్రదేశ్​లోని సత్నా జిల్లాలో ఓ వింత సంఘటన వెలుగు చూసింది. 62 ఏళ్ల ఓ వృద్ధ భర్త, 30 ఏళ్ల భార్య ఇద్దరూ కలిసి మంగళవారం ఉదయం ఒకేసారి ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. కాగా, నవజాత శిశువుల ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉండటం వల్ల వైద్యులు వారిని ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచి పర్యవేక్షిస్తున్నారు.

Old man becomes father : జిల్లాలోని ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా (62), హీరాబాయి కుష్వాహా (30) దంపతులు. సోమవారం రాత్రి గోవింద్ భార్య హీరాబాయికి పురిటి నొప్పులు రావడం వల్ల ఆమెను సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలు పరీక్షల అనంతరం వైద్యులు మంగళవారం ఉదయం హీరాబాయికి ఆపరేషన్​ చేశారు. ఈ కాన్పులో ఆమె ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా, శిశివుల ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉండటం కారణంగా వారిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

"అతర్వేదియా గ్రామానికి చెందిన హీరాబాయి కుష్వాహాకు పురిటి నొప్పులు రావడం వల్ల సోమవారం జిల్లా ఆసుపత్రిలో చేరారు. మంగళవారం ఉదయం 6:10 గంటల సమయంలో హీరాబాయి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. మామూలుగా సాధారణ ప్రసవం 35 వారాలకు పూర్తవుతుంది. కానీ, ఈమె ఎనిమిదన్నర నెలలకే ప్రసవించడం కారణంగా పిల్లలు బలహీనంగా పుట్టారు. ప్రస్తుతం వీరి పరిస్థితి విషమంగా ఉంది. శిశువులను ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము." అని జిల్లా ఆస్పత్రి వైద్యులు డాక్టర్ అమర్ సింగ్ తెలిపారు.

"నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. మొదటి భార్య పేరు కస్తూరిబాయి. ఆమె వయసు 60 సంవత్సరాలు. మాకు ఓ కుమారుడు జన్మించాడు. అతడు 18 ఏళ్ల వయసులో ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. అందుకే పిల్లల కోసం మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం పుట్టిన పిల్లలు చికిత్స పొందుతున్నారు. వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను."

- గోవింద్ కుష్వాహ, వృద్ధుడు

మొదటి భార్యే దగ్గరుండి మరీ!
తమకు పుట్టిన కుమారుడు మరణించడం వల్ల గోవింద్ కుష్వాహా మొదటి భార్య కస్తూరిబాయే దగ్గరుండి మరీ తన భర్తకు రెండో వివాహం జరిపించింది. 30 ఏళ్ల హీరాబాయి మెడలో గోవింద్​తో మూడు ముళ్లు వేయించింది. దాదాపు వివాహం జరిగిన 6 సంవత్సరాల తరువాత మంగళవారం ఉదయం వీరిద్దరికీ ముగ్గురు పిల్లలు జన్మించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.