Bachendri Pal Himalaya adventure: హిమాలయ పర్వత శ్రేణులు అత్యంత శీతల వాతావరణానికే కాకుండా ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఆలవాలం! అటువంటి సానువుల్లో సుదీర్ఘమైన సాహస యాత్రను కొనసాగిస్తోంది 12 మందితో కూడిన ఓ భారతీయ మహిళా బృందం. వీరందరూ 50 ఏళ్లకు పైబడిన వారే కావడం గమనార్హం. బచేంద్రిపాల్ నాయకత్వంలోని ఈ బృందం ఈ ఏడాది మార్చి 12న భారత-మయన్మార్ సరిహద్దుల్లోని పాంగ్ సౌ కనుమ మార్గం(పట్కాయ్ హిల్స్) నుంచి ప్రయాణాన్ని కాలినడకన ప్రారంభించింది. తూర్పున అరుణాచల్‌ప్రదేశ్‌లోని హిమాలయాల కొస నుంచి పశ్చిమాన లద్దాఖ్‌లోని కార్గిల్ ప్రాంతానికి సుమారు 4,977 కి.మీ.దూరాన్ని ట్రెకింగ్ ద్వారా చేరుకోవడం వారి లక్ష్యం.
గత మూడు నెలల్లో ఈ బృందం అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఎగువ బంగాల్, సిక్కింలతో పాటు నేపాల్ పరిధి హిమాలయ పర్వత శ్రేణుల గుండా ముందుకు సాగింది. ప్రతి రోజు సగటున 25 కి.మీ.దూరం కొండలు, కోనలు, లోయలు, ఎత్తు పల్లాలను దాటుకుంటూ వెళ్తోంది. ప్రస్తుతం వీరు సముద్ర మట్టానికి 17,769 అడుగుల ఎత్తునుండే తొరంగ్లా పాస్‌ను చేరుకున్నారని సాహసయాత్రకు చేయూతనిస్తున్న టాటా స్టీల్ కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. గమ్యస్థానం కార్గిల్‌కు జులై చివరి వారంలో మహిళా బృందం చేరుకుంటుందన్నారు.
ఇదీ చదవండి: