5 Year old Rape: మహారాష్ట్రలో దారుణం జరిగింది. ముంబయిలో ఐదేళ్ల బాలికపై 52 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. పాఠశాల ఆవరణలోనే ఆమెపై బలత్కారం చేశాడు. నిందితుడు గతంలో అదే స్కూల్లో పనిచేశాడని నవఘర్ పోలీసులు తెలిపారు. బాలికకు మాయమాటలు చెప్పి.. ఓ గదిలోకి తీసుకెళ్లాడని వెల్లడించారు. అక్కడే అత్యాచారం చేశాడని చెప్పారు. బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లామని, చికిత్స కొనసాగుతోందని స్పష్టం చేశారు.
UP 8 year girl rape: ఉత్తర్‌ప్రదేశ్ లలిత్‌పుర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి తల్లి చేసిన ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అదనపు ఎస్పీ గిరిజేశ్ కుమార్ తెలిపారు. తన కూతురిని మభ్యపెట్టి తనతో పాటు తీసుకెళ్లి రేప్ చేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదులో పేర్కొంది.
మాట్రిమోనీ వెబ్సైట్లో ఓ మహిళను పరిచయం చేసుకొని అత్యాచారానికి పాల్పడ్డాడు పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి. 2017లో పెళ్లి పేరుతో బాధిత మహిళతో పరిచయం పెంచుకున్న 48 ఏళ్ల ఆకాశ్... ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతకుముందే, ఆమె నుంచి రూ.70 లక్షలు తీసుకున్నాడు. ఫ్లాట్ అమ్మేసి తాను ఆ డబ్బును అతడికి ఇచ్చానని మహిళ చెప్పారు. తన పేరుతో లోన్ కూడా తీసుకున్నాడని.. పెళ్లి చేసుకుందామని అడిగేసరికి పారిపోయాడని తెలిపారు. 2018లో నిందితుడిని ఉద్దేశపూర్వక ఎగవేతదారుడిగా ప్రకటించారు. ఐదేళ్లుగా అతడిని వెతుకుతున్న పోలీసులకు ఎట్టకేలకు ఆదివారం నోయిడాలో చిక్కాడు. నిందితుడిని మంగళవారం కోర్టు ముందు హాజరుపర్చారు. న్యాయస్థానం అతడికి జ్యుడిషియల్ కస్టడీ విధించింది. గతంలో గురుగ్రామ్‌కు చెందిన ఓ మహిళను నిందితుడు రూ.60లక్షలు మోసం చేశాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: