ఝార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో దారుణం జరిగింది. కామడార బ్లాక్ పహాడ్గావ్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్యకు గురయ్యారు. నిందితుడు.. గొడ్డలితో నరికి చంపినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనతో ఊళ్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ ఘటనలో ఓ చిన్నారి కూడా మృతిచెందారు. అయితే కుటుంబ కలహాల వల్లే హత్య చేసి ఉంటారని స్థానిక ఎస్పీ పేర్కొన్నారు. నిందితుని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి:'కొరొనిల్' వివాదంలో హర్షవర్ధన్‌కు డీఎంఏ మద్దతు