ETV Bharat / bharat

'ఆ జిల్లాల్లో తీవ్ర స్థాయిలో కరోనా వ్యాప్తి' - health ministry

జులై 15 చివరివారంలో దేశంలోని 47 జిల్లాల్లో పది శాతం కొవిడ్ పాజిటివిటీ రేటు నమోదైందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొవిడ్​ నిబంధనలను విస్మరిస్తే పరిస్థితులు చేజారిపోతాయని హెచ్చరించింది.

covid, corona cases
కరోనా వ్యాప్తి, కొవిడ్
author img

By

Published : Jul 16, 2021, 7:32 PM IST

జులై 15 చివరివారం కల్లా 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 47 జిల్లాల్లో 10 శాతం కొవిడ్ పాజిటివిటీ రేటు నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. 73 జిల్లాల్లో రోజుకు 100కు పైగా కేసులు నమోదైనట్లు పేర్కొంది.

అయితే.. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గడం ఓ హెచ్చరికలా భావించాలని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కొవిడ్ నిబంధనలను విస్మరిస్తే పరిస్థితులు మళ్లీ చేజారిపోయే అవకాశముందని స్పష్టం చేసింది.

"వైరస్​పై వ్యాక్సిన్​లు మెరుగ్గా పనిచేస్తున్నాయి. గర్భిణీలు కూడా టీకా తీసుకోవడం శ్రేయస్కరం. వ్యాక్సిన్​ టీసుకున్నప్పటికీ కొవిడ్​ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి."

--డాక్టర్ వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు.

మణిపుర్, కేరళ, రాజస్థాన్, మేఘాలయ, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అసోం, మహారాష్ట్ర, పుదుచ్చేరిలో 10 శాతం పాజిటివిటీ రేటు నమోదైనట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:డెల్టా ముప్పు- మళ్లీ కర్ఫ్యూ దిశగా ఆ దేశం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.