దేశంలో కరోనా కేసులు గురువారంతో పోలిస్తే పెరిగాయి. కొత్తగా 44,643 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 464 మంది మరణించారు. తాజాగా 41,096 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
మొత్తం కేసులు: 3,18,56,757
మొత్తం మరణాలు: 4,26,754
కోలుకున్నవారు: 3,10,15,844
యాక్టివ్ కేసులు: 4,14,159
టీకాల పంపిణీ
దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం నిర్విరామంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు మొత్తం 49,53,27,595 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. గురువారం కొత్తగా 57,97,808 డోసులు అందించినట్లు పేర్కొంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
వివిధ రాష్ట్రాల్లో కేసులు..
కేరళలో కొత్తగా 22,040 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 117 మంది ప్రాణాలు కోల్పోయారు.
మహారాష్ట్రలో కొత్తగా 6,695 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 120 మంది మరణించారు.
తమిళనాడులో 1,997 కరోనా కేసులు నమోదవగా.. వైరస్ ధాటికి మరో 33 మంది బలయ్యారు.
కర్ణాటకలో కొత్తగా 1,785 కేసులు నమోదయ్యాయి. మరో 25 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఒడిశాలో కొత్తగా 1,342 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 68 మంది చనిపోయారు.
మిజోరంలో 1,088 కొత్త కరోనా కేసులు వెలుగు చూడగా.. 684 మంది కోలుకున్నారు. వైరస్ ధాటికి ఒకరు ప్రాణాలు కోల్పోయారు.
గుజరాత్లో మరో 102 మందికి కరోనా సోకినట్లు తేలగా.. రాజస్థాన్‌లో 40 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది.
మణిపుర్లో కొత్తగా 757 మందికి కరోనా సోకింది. 1,078 మంది కోలుకోగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చూడండి: కరోనా వేళ.. జీవన హక్కుకు హామీ లభించేనా?