గణతంత్ర దినోత్సవం నాడు రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీలో జరిగిన హింసకు సంబంధించి 80 మంది ఆందోళనకారులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే 38 కేసులు నమోదు అయ్యాయని పేర్కొన్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యయసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని ఈ నెల 26న రైతులు ట్రాక్టర్ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో దిల్లీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ ర్యాలీలో వేలాది మంది రైతులు పోలీసులతో గొడవ పడ్డారు. చాలా మంది ట్రాక్టర్లను నడుపుతూ.. పోలీసుల మీదుకు దూసుకుపోయారు. మరి కొంతమంది ఆందోళనకారులు ఎర్రకోటకు చేరుకుని హింసకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: 'రిపబ్లిక్ డే' ఘటన బాధ కలిగించింది: రాష్ట్రపతి