ETV Bharat / bharat

నేడు కశ్మీర్​లో రెండో విడత పోలింగ్ - jammu kashmir ddc polls

జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల ఎన్నికల రెండో విడత పోలింగ్ నేడు జరగనుంది. 43 స్థానాలకు 321మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు. కశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తర్వాత జరుగుతున్న మొదటి ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను మొత్తం 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. తొలి విడత నవంబర్ 28న పూర్తైంది. 52 శాతం పోలింగ్ నమోదైంది.

321 candidates in electoral fray for second phase of DDC polls
నేడు కశ్మీర్​లో రెండో విడత పోలింగ్
author img

By

Published : Dec 1, 2020, 5:37 AM IST

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న తొలి స్థానిక సంస్థల ఎన్నికలకు నేడు రెండో విడత పోలింగ్ జరగనుంది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. రెండో విడత ఎన్నికల్లో మొత్తం 43 స్థానాలకు గాను 321 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కశ్మీర్​ డివిజన్​లో 25, జమ్ము డివిజన్​లో 18 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు మాత్రమే ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుంది.

కశ్మీర్ డీడీసీ ఎన్నికలను మొత్తం 8 విడతల్లో నిర్వహిస్తోంది ప్రభుత్వం. నవంబర్​ 28న జరిగిన తొలి దశ పోలింగ్​లో 52 శాతం ఓటింగ్ నమోదైంది. డిసెంబర్​ 19న మలి విడత పోలింగ్ జరగనుంది. 22న ఫలితాలు వెలువడుతాయి.

రెండో విడతలో 83 సర్పంచ్ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరుగుతున్నట్లు జమ్ముకశ్మీర్ ఎన్నికల కమిషనర్ కేకే శర్మ తెలిపారు. మొత్తం 223మంది అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సాగుచట్టాల చర్చ వేళ 'ఆడియో కట్​'పై ప్రభుత్వం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.