ETV Bharat / bharat

ఆ సీఎం బంపర్​ ఆఫర్​.. కరెంట్​ 300 యూనిట్లు ఫ్రీ - పంజాబ్​ ఆప్​ సర్కార్​

Free Electricity Punjab: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంది పంజాబ్​లోని ఆప్​ సర్కార్​. ప్రతి ఇంటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది.

300 units of free electricity from July 1 in Punjab

author img

By

Published : Apr 16, 2022, 10:12 AM IST

Updated : Apr 16, 2022, 10:58 AM IST

Free Electricity Punjab: పంజాబ్​లో ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆమ్​ ఆద్మీ ప్రభుత్వం.. అక్కడి ప్రజలకు శుభవార్త చెప్పింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ.. ఇంటింటికి 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ అందించనున్నట్లు తాజాగా ప్రకటించింది. జులై 1 నుంచి ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. శనివారం సాయంత్రం కల్లా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్​ 16న శుభవార్త వింటారని సీఎం భగవంత్​ మాన్​ గురువారం వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి సంబంధించి 200 యూనిట్ల కరెంట్​ ఉచితంగా ఇస్తుంది ఆప్​ ప్రభుత్వం.

ఈ ఏడాది జరిగిన పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ.. 92 చోట్ల జయకేతనం ఎగురవేసింది. మార్చి 16న భగవంత్‌ మాన్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. సరిగ్గా ప్రభుత్వం కొలువుదీరిన నెల అనంతరం.. రాష్ట్ర ప్రజలకు శుభవార్త ప్రకటించింది. ఎన్నికల్లో మరో ప్రధాన హామీ అయిన డోర్‌స్టెప్‌ రేషన్ డెలివరీ పథకాన్ని సీఎం గత నెల అమల్లోకి తెచ్చారు. దేశ రాజధాని దిల్లీలోనూ ఆమ్‌ ఆద్మీ సర్కారు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందిస్తోంది.

ఇవీ చూడండి: మదురై చిథిరై ఉత్సవాల్లో తొక్కిసలాట.. ఇద్దరు మృతి

కరెంట్ 125 యూనిట్లు ఫ్రీ.. బస్ టికెట్లపై 50% డిస్కౌంట్.. సీఎం బంపర్ ఆఫర్!

Last Updated : Apr 16, 2022, 10:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.