ETV Bharat / bharat

29 మందితో కర్ణాటక కేబినెట్- యడ్డీ కుమారుడికి నిరాశ! - కర్ణాటక కేబినెట్ వార్తలు

కర్ణాటక కొత్త మంత్రివర్గంలో 29 మందికి చోటు లభించింది. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడికి కేబినెట్​లో అవకాశం దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది.

karnataka cabinet
కర్ణాటక కేబినెట్
author img

By

Published : Aug 4, 2021, 12:53 PM IST

కర్ణాటకలో కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు మొండిచెయ్యి లభించింది. యడ్డీ కుమారుడికి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించినా నిరాశే ఎదురైంది. రాష్ట్ర మంత్రివర్గ కూర్పు తుది దశకు చేరుకుందని, యడియూరప్ప కుమారుడు బీవై విజయేంద్ర పేరు జాబితాలో లేదని కొత్త సీఎం బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు.

by vijayendra
బీవై విజయేంద్ర, యడ్డీ కుమారుడు

29 మంది ఎమ్మెల్యేలతో కొత్త కేబినెట్ రూపొందినట్లు సీఎం బసవరాజ్ తెలిపారు. మధ్యాహ్నం 2.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు.

"దిల్లీ హైకమాండ్​తో విస్తృత చర్చలు జరిపాను. అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే కేబినెట్​పై నిర్ణయం తీసుకున్నాం. ఈ జాబితాను గవర్నర్​కు పంపించాం. హైకమాండ్ నిర్ణయాన్ని అనుసరించి ఉపముఖ్యమంత్రులను ఎంపిక చేయలేదు. మంత్రుల ఎంపికలో ఎవరి ఒత్తిడీ లేదు. యడియూరప్పతో పార్టీ జాతీయ అధ్యక్షుడు మాట్లాడారు. కర్ణాటక ఇంఛార్జిగా ఉన్న అరుణ్ సింగ్ విజయేంద్రతో వ్యక్తిగతంగా చర్చించారు. విజయేంద్ర పేరు జాబితాలో లేదని మాత్రమే నేను చెప్పగలను."

-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక ముఖ్యమంత్రి

యడ్డీ సహా ఆయన అనుచరులు విజయేంద్రకు మంత్రి పదవి దక్కేలా చివరి క్షణం వరకూ శతవిధాలా ప్రయత్నించారు. కానీ, హైకమాండ్ ఇందుకు సుముఖంగా లేదని సమాచారం. విజయేంద్రకు మంత్రి పదవి ఇచ్చేందుకు నిరాకరించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సీఎం పదవికి గట్టి పోటీ అనుకున్న అర్వింద్ బెల్లాడ్​కు సైతం ఎలాంటి పదవీ దక్కలేదు.

వారి మార్గనిర్దేశనంతోనే..

మరోవైపు, అనుభవజ్ఞులు, యువకుల కలబోతతో కొత్త కేబినెట్​ను రూపొందించినట్లు బొమ్మై తెలిపారు. ఏడుగురు ఓబీసీలు, ముగ్గురు ఎస్సీలు, ఏడుగురు ఒక్కలిగలు, 8 మంది లింగాయత్​లు, ఓ ఎస్టీ, ఓ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించిందని వివరించారు. ఓ మహిళను సైతం కేబినెట్​లోకి తీసుకున్నామని చెప్పారు. పరిపాలనను మెరుగుపర్చడం సహా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, భాజపా అధ్యక్షుడు నడ్డా మార్గనిర్దేశనంతో కేబినెట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: హత్యాచార బాధితురాలి కుటుంబానికి అండగా రాహుల్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.