ETV Bharat / bharat

బంగాల్​ ఏడో దశలో 26 శాతం మంది నేరచరితులే..

author img

By

Published : Apr 20, 2021, 5:22 AM IST

బంగాల్​ ఏడో దశ ఎన్నికల్లో బరిలోకి దిగిన 284 మంది అభ్యర్థుల్లో 26 శాతం నేరచరిత్ర కలిగి ఉన్నట్లు 'అసోసియేషన్‌ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్(ఏడీఆర్​)' వెల్లడించింది. వీరిలో 18 మంది క్రిమినల్​ కేసులు సహా మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని తెలిపింది.

ADR  report on bengal 7th phase
బంగాల్​ ఏడో విడత

బంగాల్​ ఏడో విడత అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో 26 శాతం మందికి నేరచరిత్ర ఉన్నట్లు 'అసోసియేషన్‌ ఫర్​ డెమొక్రటిక్​ రిఫామ్స్(ఏడీఆర్​)' స్పష్టం చేసింది. వీరిలో 18 మంది మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో అరోపణలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. ముగ్గురిపై హత్యాచార కేసులు ఉన్నట్లు ఏడీఆర్ వెల్లడించింది. బరిలో నిలిచిన అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ పత్రాలను అధ్యయనం చేసి నివేదికను సమర్పించింది.

ఈ ఎన్నికల బరిలో ఉన్న మొత్తం 284 మందిలో 73 అభ్యర్ధులపై క్రిమినల్​ కేసులు ఉండగా.. సుమారు 60 మందిపై తీవ్రమైన క్రిమినల్​ కేసులు ఉన్నట్లు ఏడీఆర్​ రిపోర్టు తెలిపింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన తృణమూల్​ కాంగ్రెస్, భాజపా, కాంగ్రెస్​ ఈ మూడు పార్టీల్లో ప్రతీ పార్టీ నుంచి 19 అభ్యర్థులపై వివిధ కేసుల్లో ఎఫ్​ఐఆర్​ నమోదైనట్లు ఏడీఆర్​ ప్రకటించింది.

ఏప్రిల్ 26న 36 నియోజకవర్గాల్లో ఏడో విడత ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 284 మంది బరిలో ఉన్నారు.

ఇదీ చదవండి : 'ఎంతటివారైనా జైలుకు వెళ్లాల్సిందే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.