ETV Bharat / bharat

కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరార్​! - త్రిపుర కొవిడ్​ కేంద్రాలు

కరోనా చికిత్స కేంద్రం నుంచి 25 మంది రోగులు పరారైన ఘటన త్రిపురలోని ధలాయి జిల్లాలో జరిగింది. మరోవైపు నేపాల్​తిలా ప్రాంతంలో అధికారులు పరీక్షలు జరపాల్సిన 200 మంది వలస కూలీలు కూడా పరారయ్యారు.

covid care facility, Ambassa Covid care centre
అంబసా కొవిడ్​ కేంద్రం
author img

By

Published : May 12, 2021, 1:21 PM IST

త్రిపురలోని ధలాయి జిల్లా అంబసా ప్రాంతంలోని కొవిడ్​ కేంద్రం నుంచి 25 మంది రోగులు పరారయ్యారు. ఈ ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. అయితే ఆ తర్వాత పోలీసుల చేపట్టిన గాలింపులో ఏడుగురు స్థానిక రైల్వే స్టేషన్​ వద్ద పట్టుబడ్డారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి బిప్లవ్​ కుమార్​ దేవ్​ అంబాసా కొవిడ్​ కేంద్రాన్ని బుధవారం సందర్శించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రోగులు పరారవడం అధికారులను ఆందోళనకు గురిచేసింది.

ఇదీ జరిగింది..

ఈనెల 7న వివిధ రాష్ట్రాలకు చెందిన 62 మంది వలస కూలీలు రైలు ద్వారా అంబసా చేరుకున్నారు. వారికి కొవిడ్​ పరీక్షలు నిర్వహించగా వారికి వైరస్​ ఉన్నట్లు తేలింది. దీంతో వారిని కొవిడ్​ చికిత్స కేంద్రానికి తరలించారు. అయితే సోమవారం అర్ధరాత్రి సుమారు ఒంటి గంటకు 25 మంది రోగులు ఎంట్రెన్స్​లో ఉన్న గ్రిల్స్​ను బద్దలు కొట్టి పరారయ్యారు. మరుసటి రోజు ఉదయం దీనిని గమనించిన అధికారి.. ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అప్రమత్తం అయిన అధికారులు పరారైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా ఏడుగురు పట్టుబడ్డారు.

200 మంది పరారు..

నేపాల్​తిలా ప్రాంతంలోనూ ఇటువంటి ఘటనే జరిగింది. పరీక్షలు చేయించుకోవాల్సిన 200 మంది వలస కూలీలు పరారయ్యారు.

ఇదీ చదవండి : దా'రుణ' యాప్​ కేసులో రూ.76 కోట్ల ఆస్తులు సీజ్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.