షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ(Modi SCO Summit) కీలక ప్రసంగం చేశారు. ఎస్సీఓలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్కు కూడా స్వాగతం పలికారు.
ఎస్సీఓ(sco summit 2021) భవిష్యత్తు గురించి ఆలోచించేందుకు ఇదే సరైన సమయమని మోదీ అభిప్రాయపడ్డారు(Modi SCO Speech). ఈ ప్రాంతంలో శాంతి, భద్రత, విశ్వసనీయత లోపించడం వంటి అంశాలు అతిపెద్ద సవాళ్లని తెలిపారు. అతివాదం, తీవ్రవాదం(Radicalisation) పెరగడమే ఈ సమస్యలకు మూల కారణమన్నారు. అఫ్గాన్‌లో ఇటీవలి పరిణామాలు దీన్ని స్పష్టం చేశాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం, అతివాదం, తీవ్రవాదంపై పోరుకు ఎస్సీఓ సభ్య దేశాలు(sco members) ఓ పటిష్ఠ ప్రణాళిక రూపొందించి అనుసరించాల్సిన అవసరం ఉందన్నారు. మధ్య ఆసియా దేశాలతో సత్సంబంధాలకు భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
'మన ప్రతిభావంతులైన యువతను శాస్త్రీయ, హేతుబద్ధమైన ఆలోచనల వైపు ప్రోత్సహించాలి. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో భారత దేశాన్ని వాటాదారుగా చేసే దిశగా వినూత్న స్ఫూర్తిని అందించడానికి మేము మా అంకుర సంస్థలు, వాటి వ్యవస్థాపకులను ఒకచోట చేర్చుతాం. అతివాదం, తీవ్రవాదంపై పోరాడాల్సిన అవసరం ఎస్సీఓ శాంతి, భద్రతల కోసమే కాదు.. మన బంగారు భవిష్యత్తుకూ కీలకం. మితవాదం, సహనంతో కూడిన సమ్మిళిత సంస్థలు, ఇస్లాంకు సంబంధించిన సంప్రదాయాలతో బలమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి ఎస్సీఓ కృషి చేయాలి. రెండు దేశాల మధ్య అనుసంధాన ప్రాజెక్టులు ఏకపక్షంగా కాకుండా సంప్రదింపులు, పారదర్శకతతో ఉండాలి.'
-ప్రధాని మోదీ.
తజికిస్థాన్ రాజధాని దుశాన్బె వేదికగా(sco summit 2021 venue) ఎస్సీఓ సదస్సు నిర్వహిస్తున్నారు. ఆ దేశ అధ్యక్షుడు ఎమోమాలి రహ్మాన్ దీనికి అధ్యక్షత వహిస్తున్నారు. భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు. మొదటిసారిగా హైబ్రిడ్ ఫార్మాట్‌లో ఈ సదస్సు జరుగుతోంది. పూర్తిస్థాయి సభ్యదేశంగా భారత్ నాలుగోసారి పాల్గొంది.
గత రెండేళ్లుగా ఈ ఎస్సీఓలో వివిధ దేశాధినేతలు భవిష్యత్ ప్రణాళికలపై చర్చించి.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈసారి సమావేశానికి(sco Meeting 2021) ఎస్సీఓ సభ్యదేశాలు, తాత్కాలిక సభ్యదేశాలు, సెక్రెటరీ జనరల్, ఎస్సీఓలోని రీజినల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్(ఆర్ఏటీఎస్) హాజరయ్యాయి.
ఇదీ చదవండి: S. Jaishankar: 'ఇతర దేశాల అంతర్గత విషయాల్లో భారత్ తలదూర్చదు'