ETV Bharat / bharat

upsc result 2021: ఆ ఇంట్లో అక్కకు 1.. చెల్లికి 15వ ర్యాంక్​ - tina dabi sister

తాజాగా విడుదలైన సివిల్స్​ పరీక్షా ఫలితాల్లో(upsc result 2021) రియా దాబి 15వ ర్యాంక్​ను కైవసం చేసుకుంది. 2015 యూపీఎస్​సీ పరీక్షల్లో ఆమె అక్క టీనా దాబి మొదటి ర్యాంకు సాధించడం విశేషం. అక్కకు తగ్గ చెల్లలు(tina dabi sister upsc) అనిపించుకుని అందరి ప్రశంసలు పొందుతోంది.(upsc result 2021 topper list)

upsc results
సోదరీమణులు
author img

By

Published : Sep 25, 2021, 7:40 PM IST

2015 యూపీఎస్‌సీ పరీక్షా ఫలితాల్లో(upsc result) అక్క మొదటి ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించింది. అక్క నుంచి స్ఫూర్తి పొందిన చెల్లి.. అదే బాటలో నడిచింది. తాజాగా విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో(upsc result 2021) 15వ ర్యాంకును సొంతం చేసుకుని.. అక్కకు తగ్గ చెల్లెలు(tina dabi sister) అనిపించుకుంది(upsc result 2021 topper list). ఇంతకీ ఈ సోదరీ'మణులు' ఎవరో తెలుసా..? వారే టీనా దాబి, రియా దాబి.

రియా సివిల్స్‌లో విజేతగా నిలిచిన విషయాన్ని టీనా ఇన్‌స్టాగ్రాం వేదికగా వెల్లడించారు. 'నా సోదరి రియా దాబి సివిల్స్‌లో 15వ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది,' అంటూ రాసుకొచ్చారు. ఈ ఇద్దరు కూడా దిల్లీలోని లేడీ శ్రీరామ్ కళాశాలోనే చదువుకున్నారు. ఇంకో విషయం ఏంటంటే.. సివిల్స్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన తొలి దళిత మహిళగా టీనా పేరు అప్పట్లో మార్మోగింది. ప్రస్తుతం ఆమె రాజస్థాన్‌ ప్రభుత్వంలో ఆదాయపన్ను శాఖలో పనిచేస్తున్నారు.

upsc results
టీనా దాబి- రియా దాబి

ఇక, శుక్రవారం సాయంత్రం విడుదలైన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో బిహార్‌కు చెందిన శుభం కుమార్ మొదటి ర్యాంకు సాధించారు. మొత్తం పది లక్షల మంది అభ్యర్థులు పోటీపడగా.. 761 మంది విజయం సాధించారు. వరంగల్‌కు చెందిన శ్రీజ 20వ ర్యాంకు సొంతం చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 మంది ఉత్తీర్ణులుగా నిలవడం గమనార్హం.

ఇదీ చూడండి:- 'నా విజయం బిహార్​ యువకులకు ప్రేరణ లాంటిది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.