అసోంలో పిడుగులు పడి 20 ఏనుగులు మరణించాయి. నాగావ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి గురువారం తెలిపారు.
![elephants killed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/as-smg-03-13may-eleohants-death-visbite-asc10079_13052021185002_1305f_1620912002_215_1305newsroom_1620912210_858.jpg)
![elephants killed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/as-smg-03-13may-eleohants-death-visbite-asc10079_13052021185002_1305f_1620912002_45_1305newsroom_1620912210_1038.jpg)
కాతియాటోలి రేంజ్లోని కుందోలి అటవీ సంరక్షణ ప్రాంతంలోని ఓ కొండపై బుధవారం రాత్రి పిడుగుల వర్షం కురిసిందని అటవీ సంరక్షణ ముఖ్యాధికారి అమిత్ సహాయ్ చెప్పారు. స్థానికుల ఇచ్చిన సమాచారంతో తాము ఏనుగుల మృతదేహాలు తనిఖీ చేసేందుకు వెళ్లామని చెప్పారు.
"ఈ ప్రాంతం చాలా దూరంగా ఉంటుంది. గురువారం మధ్యాహ్నం మా బృందం ఇక్కడకు చేరుకోగలిగింది. మేము వెళ్లి చూసి చూసేసరికి.. బామునీ కొండ ప్రాంతంలో 20 ఏనుగుల మృతదేహాలు కనిపించాయి."
- అమిత్ సహాయ్, అటవీ సంరక్షణ ముఖ్యాధికారి
![elephants killed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/as-smg-03-13may-eleohants-death-visbite-asc10079_13052021185002_1305f_1620912002_639_1305newsroom_1620912210_625.jpg)
![elephants killed](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/as-smg-03-13may-eleohants-death-visbite-asc10079_13052021185002_1305f_1620912002_994_1305newsroom_1620912210_515.jpg)
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పిడుగు పాటు కారణంగానే ఈ ఏనుగులు మరణించినట్లు తేలిందని అమిత్ సహాయ్ తెలిపారు. అయితే.. పోస్టు మార్టం అనంతరమే.. ఈ ఏనుగుల మృతికి కచ్చితమైన కారణాలు వెల్లడించగలమని చెప్పారు.
ఇదీ చూడండి: కరోనాను జయించిన 13 మంది కుటుంబ సభ్యులు
ఇదీ చూడండి: బిహార్లో పిడుగుల వర్షం- 13 మంది మృతి